సామ్ టు స్వీటీ కుర్ర హీరోలతో రొమాన్స్ చేసిన తెలుగు హీరోయిన్లు వీళ్లే..!!

టాలీవుడ్ లో చాలామంది హీరోయిన్లు వయస్సుతో సంబంధం లేకుండా కుర్ర హీరోలతో నటించి.. రొమాన్స్ చేస్తున్న సంగతి తెలిసిందే. ‘ ప్రేమకు ఏజ్ తో సంబంధం ఏముంది రా చారి ‘ అంటూ అదుర్స్ సినిమాల్లో కమెడియన్ బ్రహ్మానందం ఒక డైలాగ్ చెపుతాడు.


అదే తరహాలో రియల్ లైఫ్ లో చాలా లవ్ స్టోరీస్ ఉన్నా సినిమాల్లో కూడా తమకంటే చిన్న వయసు హీరోలతో రొమాన్స్ చేసిన హీరోయిన్లు వీరే అంటూ తాజాగా సోషల్ మీడియాలో ఓ వార్త వైరల్ అవుతుంది.

తాజాగా తెరకెక్కిన ‘ మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి ‘ సినిమాలో సీనియర్ హీరోయిన్ అనుష్క యంగ్ హీరో నవీన్ పోలిశెట్టితో కలిసి నటించింది. అలాగే సమంత విజయ్ దేవరకొండ తో ఖుషి సినిమాలో.. బెల్లంకొండ శ్రీనివాస్ తో ‘ అల్లుడు శ్రీను ‘ సినిమాలో సమంత, ‘మిస్టర్ మజ్ను ‘ అక్కినేని అఖిల్తో.. నిధి అగర్వాల్, ‘ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ‘ మూవీలో అఖిల్తో పూజా హెగ్డే, ‘ దేవదాస్ ‘ మూవీలో ఇలియానాతో రామ్ పోతినేని, ‘ గణేష్ ‘ సినిమాలో కాజల్తో కూడా జతకట్టాడు.

అలాగే ఎన్టీఆర్, మహేష్ బాబు తమ కంటే ఎక్కువ ఏజ్ ఉన్న హీరోయిన్లతో కలిసి నటించారు. ఈ హీరో రీల్ లైఫ్ లోనే కాకుండా రియల్ లైఫ్ లో కూడా తనకంటే నాలుగేళ్లు పెద్దదైన నమ్రతను వివాహం చేసుకున్నాడు. సింహాద్రి సినిమాలో ఎన్టీఆర్ తనకంటే నాలుగేళ్లు పెద్దదైన భూమికతో రొమాన్స్ చేశాడు.