మహేష్‌కు బాకీ చెల్లించాలి.. త్వరలోనే తీరుస్తానని డైరెక్టర్ షాకింగ్ కామెంట్స్…

కోలీవుడ్ స్టార్ దర్శకుడు ఎస్ జే సూర్య గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఆయన ఎన్నో సూపర్ హిట్ సినిమాలకు దర్శకత్వం వహించారు. సూర్య తెలుగులో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ని హీరోగా తీసుకొని ‘ఖుషి’ సినిమా డైరెక్ట్ చేసాడు. ఈ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ ని అందుకున్నాడు. ఈ సినిమా ఎంత పెద్ద హిట్ అయింది అనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎస్ జె సూర్య ఒకవైపు నటుడిగా రాణిస్తూనే, మరోవైపు దర్శకుడిగా కొనసాగుతున్నాడు. ఇక ఇప్పుడేమో విలన్ గా అవతారం ఎత్తి తన సత్తా చాటుకుంటున్నాడు.

అలానే కొన్ని సినిమా లో కామెడీ రోల్ లో నటిస్తూ  ప్రేక్షకులకు నవ్విస్తున్నారు. తాజాగా ఎస్ జే సూర్య ‘మార్క్ అంథోని ‘ అనే సినిమా లో నటించారు. విశాల్ హీరోగా నటించిన ఈ సినిమా కామెడీ ఎంటర్టైనర్ గా తెరకేక్కింది. రీసెంట్ గా ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ ను మేకర్స్ రిలీజ్ చేసారు. ప్రేక్షకులను ‘మార్క్ అంథోని ‘ మూవీ ట్రైలర్ బాగా ఆకట్టుకుంటుంది. ఈ సినిమా లో విశాల్, సూర్య డిఫరెంట్ లుక్స్ లో కనిపించి అందరిని అల్లరిస్తున్నారు. ముఖ్యంగా ఎస్ జే సూర్య తన కామెడీ టైమింగ్ తో ఆడియన్స్ ని కడుపుబ్బ నవ్విస్తున్నారు. ఇక ఈ సినిమా ని తెలుగు, తమిళ భాషలో గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నారు.

తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ని నిర్వహించారు. ఈ ఈవెంట్ లో ఎస్ జె సూర్య కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. సూర్య మాట్లాడుతూ ‘ దర్శకుడిగా తమిళ్ లో అజిత్ కి, విజయ్ కి బ్లాక్ బస్టర్ హిట్స్ ని అందించాను. ఇక తెలుగులో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి ఖుషి సినిమా ద్వారా బ్లాక్ బస్టర్ హీట్ ని ఇచ్చాను. కానీ సూపర్ స్టార్ మహేష్ బాబుకు మాత్రం హిట్ ఇవ్వలేకపోయ్యను. ఆయనకి నేను బాకీ పడ్డాను. తొందర్లోనే ఆయనతో ఒక సినిమా చేసి బ్లాక్ బస్టర్ హీట్ ని అందిస్తాను ‘ అని చెప్పాడు. ఇక సరికొత్త కథతో మహేష్ కి మంచి బ్లాక్ బస్టర్ ని అందించాలని ఎస్ జే సూర్య కోరుకుంటున్నారు. త్వరలో మహేష్, సూర్య కాంబినేషన్ లో మూవీ రావాలని ఫ్యాన్స్ కూడా ఆశపడుతున్నారు.