అమ్మ బాబోయ్‌.. అసిస్టెంట్ పెళ్లిలో ర‌ష్మిక క‌ట్టుకున్న చీర అంత కాస్ట్లీనా..?

నేష‌న‌ల్ క్ర‌ష్ ర‌ష్మిక మంద‌న్నా తాజాగా హైద‌రాబాద్ లో జ‌రిగిన త‌న అసిస్టెంట్ సాయి బాబు పెళ్లిలో సంద‌డి చేసిన సంగ‌తి తెలిసిందే. క‌ల‌ర్ చీర‌లో అందంగా ముస్తాబైన ర‌ష్మిక‌.. సాయి వివాహ వేడుక‌లో స్పెష‌ల్ అట్రాక్ష‌న్ గా క‌నిపించింది. నూత‌న వ‌ధూవ‌రుల‌ను ఆశీర్వ‌దించి.. విషెస్ చెప్పింది. ఆపై వారితో క‌లిసి ఫోటోల‌ను పోజులిచ్చింది.

కొత్త దంపతులు ర‌ష్మిక కాళ్ల‌పై ప‌డ‌టం మ‌రొక విశేషం. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు ఇప్ప‌టికే వైర‌ల్ అయ్యాయి. అయితే ఇప్పుడు సాయి బాబు మ్యారేజ్ లో ర‌ష్మిక క‌ట్టుకున్న చీర ధ‌ర ఇప్పుడు అంద‌రినీ ఆశ్చ‌ర్య‌ప‌రుస్తోంది. ఆరెంజ్ క‌ల‌ర్ చీర మ‌రియు మ్యాచింగ్ స్లీవ్ లెస్ బ్లౌజ్‌ ను ర‌ష్మిక ధ‌రించింది. ఈ శారీని ప్ర‌ముఖ ఫ్యాష‌న్ డిజైన‌ర్ అనితా డోంగ్రే డిజైన్ చేశారు.

ఇంత‌కీ ర‌ష్మిక క‌ట్టుకున్న ఆ చీర కాస్ట్ ఎంతో తెలిస్తే.. రూ. 35 వేలు. ఈ విష‌యం తెలిసి నెటిజ‌న్లు అమ్మ బాబోయ్ అంటూ అవాక్కైపోతున్నారు. ర‌ష్మిక చీర చాలా అంటే చాలా సింపుల్ గా ఉండ‌టంతో.. చాలా మంది దాని ధ‌ర 35 వేల రూపాయిలంటే న‌మ్మ‌లేక‌పోతున్నారు. కాగా, సినిమాల విష‌యానికి వ‌స్తే.. ర‌ష్మిక సౌత్ తో పాటు నార్త్ లోనూ బ్యాక్ టు బ్యాక్ సినిమాల‌తో దూసుకుపోతోంది. ప్ర‌స్తుతం ఈ బ్యూటీ చేతిలో నాలుగు భారీ ప్రాజెక్ట్ లు ఉన్నాయి. పుష్ప 2, యానిమ‌ల్‌, రెయిన్ బోతో పాటు ధ‌నుస్ 51వ చిత్రంలో ర‌ష్మిక భాగం అయింది. ఈ నాలుగు సినిమాలు షూటింగ్ ద‌శ‌లోనే ఉన్నాయి.