అక్కినేని ఫ్యామిలీలో భారీ మార్పులు.. రాత్రికి రాత్రి “ఏం మాయ జరిగిందో”..?

ఈ మధ్యకాలంలో అక్కినేని ఫ్యామిలీ సోషల్ మీడియాలో ఏ రేంజ్ లో ట్రోలింగ్ కి గురి అవుతుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మరీ ముఖ్యంగా బ్యాక్ టు బ్యాక్ ఫ్యామిలీలో ఉన్న హీరోలు నటించిన సినిమాలు డిజాస్టర్ గా మారడం.. అంతేకాకుండా ఇద్దరు లైఫ్ లో కూడా సక్సెస్ కాలేకపోవడం.. అక్కినేని అఖిల్ – అక్కినేని నాగచైతన్య వయసు ఉన్న హీరోలు పాన్ ఇండియా రేంజ్ లో సినిమాకో నటిస్తూ 100 కోట్ల క్లబ్ లోకి చేరుతుంటే ఈ ఇద్దరు హీరోలు మాత్రం భారీ డిజాస్టర్లు తమ ఖాతాలో వేసుకుంటూ వచ్చారు. ఫ్యామిలీ పరంగా కూడా సెటిల్ కాకపోవడంతో ఇద్దరిని ఏకేశారు జనాలు .

అయితే రీసెంట్గా సోషల్ మీడియాలో అక్కినేని ఫ్యామిలీని పొగుడుతూ మళ్ళీ అక్కినేని ఫ్యామిలీకి పునర్ వైభవం తీసుకొచ్చేలా ఉన్నారు అంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు . దానికి కారణం రీసెంట్ గానే అక్కినేని నాగార్జున తన మాజీ కోడలు సమంత పేరును ఎంతో ప్రేమగా ఆప్యాయంగా పలకడమే . రీసెంట్గా స్టార్ట్ అయిన బిగ్ బాస్ సీజన్ సెవెన్ హోస్ట్ చేస్తున్న నాగార్జున షోకి ప్రమోషన్స్ కోసం వచ్చిన విజయ్ దేవరకొండ తో “ఎక్కడ మీ హీరోయిన్ సమంత ..?”అంటూ పలకరించారు. నిజానికి విడాకులు తీసుకున్న తర్వాత ఎన్నో సందర్భాలలో సమంత పేరుని నాగార్జున ప్రస్తావించి ఉండొచ్చు.. కానీ ఎప్పుడూ కూడా ఆమె పేరుని పలకలేదు .

ఇన్నేళ్ల తర్వాత ఫస్ట్ టైం ఆమె పేరును పలకడంతో సమంత ఫ్యాన్స్ కూడా ఖుషి అయిపోయారు . అంతేకాదు రీసెంట్గా అక్కినేని నాగార్జున భార్య అమల దాదాపు 30 ఏళ్ల తర్వాత స్టేజిపై డాన్స్ చేసింది . దీనికి సంబంధించిన వీడియోస్ సోషల్ మీడియాలో వైరల్ అయింది . అన్నపూర్ణ స్టూడియోస్ లో ణేఓ Fఏశ్టా 2023 ఈవెంట్లో ముఖ్యఅతిథిగా పాల్గొన్న అక్కినేని అమల అభిమానుల కోరిక మేరకు స్టేజిపై నాగార్జున నటించిన హలో బ్రదర్ సినిమాలోని “ప్రియరాగాలే” పాటకు తనదైన స్టెప్స్ వేసి అలరించింది . ఇలా బ్యాక్ టు బ్యాక్ అక్కనేని నాగార్జున అమల అభిమానులను ఎంటర్టైన్ చేయడంతో అక్కినేని ఫ్యామిలీ పేరు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అంతేకాదు నిన్న మొన్నటి వరకు తిట్టిన ట్రోల్ చేసిన పెద్దగా పట్టించుకోని అక్కినేని ఫ్యామిలీ..ఉన్నపలంగా ఇలా ఫ్యాన్స్ ని ఎంటర్ టైన్ చేయడం వెనుక అర్ధం ఏంటో అంటూ జనాలు కామెంట్స్ చేస్తున్నారు..!!