మైండ్ గానీ దొబ్బిందా.. `చంద్ర‌ముఖి 2` మేక‌ర్స్ ను ఏకేస్తున్న నెటిజ‌న్స్‌.. కార‌ణం ఏంటంటే?

2005లో వ‌చ్చిన బ్లాక్ బ‌స్ట‌ర్ చంద్ర‌ముఖి మూవీకి సీక్వెల్ గా `చంద్ర‌ముఖి 2` రాబోతున్న సంగ‌తి తెలిసిందే. అయితే సీక్వెల్ గా ర‌జ‌నీకాంత్ కాకుండా రాఘ‌వ లారెన్స్ హీరోగా న‌టిస్తున్నాడు. లైకా ప్రొడక్షన్స్ బ్యాన‌ర్ పై నిర్మిత‌మైన ఈ హ‌ర్ర‌ర్ థ్రిల్ల‌ర్ కు పి. వాసు ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. ఇందులో బాలీవుడ్ హీరోయిన్ కంగనా ర‌నౌత్ టైటిల్ పాత్ర‌ను పోషిస్తే.. వడివేలు, రాధికా శరత్ కుమార్, లక్ష్మీమీనన్, మహిమా నంబియార్ త‌దిత‌రులు కీల‌క పాత్ర‌ల‌ను పోషించారు.

వినాయక చవితి పండుగ కానుక‌గా చంద్ర‌ముఖి 2ను సెప్టెంబ‌ర్ 15న విడుద‌ల చేయ‌బోతున్న‌ట్లు మేక‌ర్స్ ఇప్ప‌టికే ప్ర‌క‌టించారు. ప్ర‌మోష‌న్స్ కూడా జోరుగా నిర్వ‌హిస్తున్నారు. కానీ, ఇప్పుడు ఈ సినిమా రిలీజ్ డేట్ ను వాయిదా వేసే ఆలోచ‌న‌లో మేక‌ర్స్ ఉన్నారంటూ ప్ర‌చారం జ‌రుగుతోంది. సెప్టెంబ‌ర్ 15న కాకుండా సెప్టెంబ‌ర్ 28న చంద్ర‌ముఖి 2 సినిమాని రిలీజ్ చేయాల‌ని మేక‌ర్స్ నిర్ణ‌యించుకున్నార‌ట‌. వీఎఫ్ఎక్స్ సహా మరిన్ని పోస్టు ప్రొడక్షన్ పనులు పెండింగ్‍లో ఉండట‌మే ఇందుకు కార‌ణ‌మ‌ని ఓవైపు ప్ర‌చారం జ‌రుగుతోంది.

మ‌రోవైపు సెప్టెంబ‌ర్ 28న రిలీజ్ చేస్తే ఐదు రోజులు లాంగ్ వీకెండ్ క‌లిసొస్తుంద‌న్న ఉద్దేశంతోనే పోస్ట్ పోన్ చేస్తున్నార‌ని కూడా టాక్ న‌డుస్తోంది. దీంతో నెటిజ‌న్లు, సినీ ప్రియులు మైండ్ గానీ దొబ్బిందా అంటూ చంద్ర‌ముఖ 2 మేక‌ర్స్ ను ఏకేస్తున్నారు. ఇందుకు కార‌ణం లేక‌పోలేదు. చంద్ర‌ముఖి 2ను వాయిదా వేసేట్లయితే అంతకంటే పిచ్చి నిర్ణయం మరొకటి ఉండదు. నిజానికి ఆ తేదీలో స‌లార్ రిలీజ్ కావాల్సి ఉంది. కానీ, స‌లార్ ను విడుద‌ల‌ను వాయిదా వేశారు. దీంతో చిన్న‌, పెద్ద అనే తేడా లేకుండా అన్ని సినిమాలు ఆ తేదీనే లాక్ చేసుకుంటున్నాయి. రామ్ `స్కంద‌`ను కూడా సెప్టెంబ‌ర్ 28కి పోస్ట్ పోన్ చేశారు. కాబ‌ట్టి, చంద్ర‌ముఖి 2 సోలోగా ఈ నెల 15వ తేదీన వ‌స్తే ఎంతో ప్ల‌స్ అవుతుంది. టాక్ ఎలా ఉన్నా పండ‌గ అడ్వాంటేజ్ తో మంచి వ‌సూళ్లు వ‌స్తాయి. మ‌రి ఈ అద్భుత అవ‌కాశాన్ని చంద్ర‌ముఖి 2 మేక‌ర్స్ వినియోగించుకుంటారా.. లేదా.. అన్న‌ది చూడాలి.