గుంటూరు కారం సినిమా నుంచి లీకైన వీడియో.. అదరగొట్టేసిన మహేష్.. వీడియో వైరల్..!!

టాలీవుడ్ లో సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. తాజాగా డైరెక్టర్ త్రివిక్రమ్ దర్శకత్వంలో గుంటూరు కారం చిత్రంలో నటిస్తూ ఉన్నారు. ఇందులో హీరోయిన్ గా శ్రీ లీల, మీనాక్షి చౌదరి నటిస్తూ ఉన్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రం కోసం మహేష్ అభిమానులు చాలా ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. అయితే ఇటివలె గుంటూరు కారం సినిమా నుంచి విడుదలైన ఫస్ట్ గ్లింప్స్ కు భారీ రెస్పాన్స్ రావడంతో ఈ సినిమాకు మంచి హైప్ ఏర్పడుతోంది.

తాజాగా ఈ సినిమా షూటింగ్ కి సంబంధించి కొన్ని వీడియోస్ ఆన్లైన్లో వైరల్ గా మారుతున్నాయి. ఈ వీడియో విషయానికి వస్తే మహేష్ గాగుల్స్ పెట్టుకొని స్టైలిష్ లుక్కులు అదరగొట్టేసాడని చెప్పవచ్చు. బ్లాక్ గాగుల్స్ లో నడుచుకుంటూ వస్తున్న మహేష్ వీడియో నెక్స్ట్ లెవెల్ లో ఉంది అంటూ కామెంట్లు చేస్తున్నారు నేటిజన్స్..అయితే ఈ సినిమా షూటింగ్ హైదరాబాదులో జరుపుకుంటున్నట్లు సమాచారం. దీంతో పెద్ద ఎత్తున అభిమానుల సైతం లోకేషన్ కి చేరుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అక్కడ లొకేషన్స్ కు అభిమానులు చేరుకొని ఆ వీడియోలను సోషల్ మీడియాలో వైరల్ గా చేస్తున్నారు.

గుంటూరు కారం సినిమా విషయానికి వస్తే హారిక హాసిని క్రియేషన్ బ్యానర్ పైన ఈ చిత్రాన్ని నిర్మిస్తూ ఉన్నారు. ఈ సినిమా కచ్చితంగా వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేయాలని చిత్ర బృందం పలు రకాల సన్నాహాలు చేస్తూ ఉన్నారు. ఈ చిత్రం అయిపోయిన వెంటనే డైరెక్టర్ రాజమౌళితో మరొక సినిమాని చేయబోతున్నారు మహేష్ బాబు ఈ సినిమా ఫ్యాన్ వరల్డ్ చిత్రంగా తెరకెక్కించడం జరుగుతోంది.