పవన్ కళ్యాణ్ చిత్రంలో కమలహాసన్ మాజీ భార్య..!!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఒకవైపు రాజకీయాలు మరొకవైపు సినిమాలతో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం పవన్ చేస్తున్న సినిమాలలో ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా కూడా ఒకటి.ఈ చిత్రాన్ని డైరెక్టర్ హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తూ ఉన్నారు. ఇందులో హీరోయిన్గా శ్రీ లీల నటిస్తోంది. ఈ సినిమా షూటింగ్ మధ్యలో గ్యాప్ తీసుకోవడంతో ఆ గ్యాప్ మధ్యలో షూటింగ్ చేస్తున్నారో లేదో అర్థం కావడం లేదు అభిమానులకు. కానీ పవన్ కళ్యాణ్ మాత్రం ఎక్కువగా ఇప్పుడు ఉస్తాద్ సినిమా షూటింగ్లోనే కనిపిస్తూ ఉన్నట్లు తెలుస్తోంది.

Ustaad Bhagat Singh: Gautami's New Role Sparks Buzz | Clapnumber

తాజాగా ఈ సినిమా సెట్స్ మీదికి వెళ్ళబోతున్నట్లు మేకర్స్ అధికారికంగా తెలియజేయడంతో పాటు సెట్స్ లో పలు రకాల ఫోటోలను కూడా రిలీజ్ చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. పవన్ కళ్యాణ్ ఇందులో పోలీస్ ఆఫీసర్ గా మరొకసారి కనిపించబోతున్నారు అయితే ఇందులో కమలహాసన్ మాజీ భార్య కూడా నటించబోతుందని వార్తలు వినిపిస్తున్నాయి.ఆమె ఎవరో కాదు నటి గౌతమి.. కమలహాసన్ తో వివాహం చేసుకోకపోయినా ఈమె మాజీ భార్య అని చెప్పవచ్చు.

కమలహాసన్ తో కొన్నేళ్లపాటు సహజీవనం చేసిన గౌతమి కొన్ని కారణాల చేత విభేదాలు రావడంతో విడిపోయారు. అయితే ఆ తర్వాత క్యాన్సర్ తో పోరాటం చేసి గెలిచిన గౌతమి రీ యంట్రీ తో మంచి అవకాశాలను అందుకుంటున్నది. స్టార్ హీరోల చిత్రాలలో తల్లిగా అత్తగా నటించిన మెప్పించిన ఈమె ఉస్తాద్ సినిమాలో పవన్ కళ్యాణ్ తల్లిగా నటించబోతున్నట్లు సమాచారం. మరి డైరెక్టర్ హరిశంకర్ ఈ విషయం పైన క్లారిటీ ఇస్తారేమో చూడాలి మరి వచ్చే ఏడాది సమ్మర్ కు ఈ సినిమా రిలీజ్ చేయబోతున్నట్లు ప్రకటించారు.