జైలర్ మూవి లెక్కలివే.. ఒక్కొక్కరికి ఎన్ని కోట్లో తెలుసా.. వైరల్ గా మారిన ట్విట్..!!

ఏదైనా సినిమాకి పాజిటివ్ టాక్ వస్తే ప్రేక్షకులు సైతం థియేటర్లోకి వెళ్లడానికి ఇష్టపడుతూ ఉంటారు..లేకపోతే టీవీలలో ఓటీటి లో వచ్చినప్పుడు ఎక్కువగా ఈ సినిమాను చూడడానికి ఇష్టపడుతూ ఉంటారు ప్రేక్షకులు.. ఇటివలె రజినీకాంత్ నటించిన జైలర్ సినిమా విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. ఈ చిత్రాన్ని డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహించక రమ్యకృష్ణ ,తమన్నా ,మోహన్లాల్, శివరాజ్ కుమార్ కీలకమైన పాత్రలో నటించారు. దాదాపుగా రజనీకాంత్ సక్సెస్ కొట్టక చాలాకాలం అవుతోంది.

From Ramya Krishnan to Shivrajkumar, team Jailer wishes Rajinikanth on his  birthday- Cinema express

రజనీకాంత్ జైలర్ సినిమాతో రూ.600 కోట్ల రూపాయలను కొల్లగొట్టారు ఈ సినిమా ఇప్పటికీ కూడా విజయవంతంగా కొనసాగుతూనే ఉంది.. సెప్టెంబర్ 7వ తేదీన ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ లో విడుదల కాబోతోంది.. ఈ చిత్రంలో నటించిన ప్రతి ఒక్కరికి కూడా నిర్మాత కళానిధి మారన్ సడన్ సర్ప్రైజ్లు ఇస్తు అందర్నీ ఆశ్చర్యపరుస్తున్నారు. తాజాగా జైలర్ సినిమాకు సంబంధించి నటీనటుల రెమ్యూనరేషన్ కూడా ఇప్పుడు వైరల్ గా మారుతోంది. మొత్తంగా రజనీకాంత్ రూ .200 కోట్ల రూపాయలు రెమ్యూనరేషన్ హాట్ టాపిక్ గా మారుతోంది.

నెల్సన్ దిలీప్ కుమార్ కు 60 కోట్లు అనిరుద్ కి రూ.30 కోట్లు, హీరోయిన్ తమన్నాకు కూడా రూ.10 కోట్ల రూపాయలు ఇచ్చినట్టుగా తెలుస్తోంది.. అయితే స్టార్ హీరోయిన్లకు సైతం ఇంతటి రెమ్యూనరేషన్ ఇవ్వకపోవడంతో పాటు తమన్నా ఏం చేసిందని అన్ని కోట్లు ఇస్తారు.. పలు రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు నేటిజన్స్.. అయితే ఇదంతా కొంతమంది ఫేక్ ట్వీట్ కామెంట్ చేస్తూ ఉండగా మరి కొంతమంది ఇన్ని కోట్లు ఒక్కొక్కరికి ఇస్తే నిర్మాతకు ఏమి మిగులుతుంది అంటే కామెంట్లు చేస్తున్నారు ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్ గా మారుతోంది.