అవార్డులు నాకు చెత్త తో సమానం.. స్టార్ హీరో విశాల్ సెన్సేషనల్ కామెంట్స్ వైరల్..!

తమిళ్ స్టార్ హీరో విశాల్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. తమిళ్‌లోనే కాకుండా తెలుగులో కూడా పలు చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు. ప్రస్తుతం “మార్క్ అంటోనీ” అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకి రాబోతున్నాడు. దీనికి రవిచంద్రన్ దర్శకత్వం వహించగా… రీతూ వర్మ హీరోయిన్గా నటిస్తుంది.

ఈ సినిమా ఈనెల 15న పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ కానుంది. తాజాగా, చిత్ర యూనిట్ చెన్నైలో ఓ సమావేశం నిర్వహించారు. అందులో పాల్గొన్న విశాల్ ఇటీవల కేంద్రం ప్రకటించిన జాతీయ చలనచిత్ర అవార్డ్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ” నాకు అవార్డులపై నమ్మకం లేదు. ప్రజలు, అభిమానులు ఇచ్చేదే నిజమైన అవార్డు. ప్రేక్షకుల ఆశీస్సులతోనే ఇండస్ట్రీలో నిలదొక్కుకున్నా.

ఒక వేళ నా సినిమాకు అవార్డు వచ్చిన వాటిని చెత్తబుట్టలో పడేస్తా” అంటూ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం విశాల్ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇటీవల పుష్ప సినిమాకు జాతీయ అవార్డు అల్లు అర్జున్ కు వచ్చిన విషయం తెలిసిందే. దీంతో విశాల్ అతడిని ఉద్దేశించి అలాంటి వ్యాఖ్యలు చేశాడని కొంతమంది నెటిజ‌న్‌లు భావిస్తున్నారు.