ఓపెన్ పోర్స్ వ్యాధితో బాధపడుతున్నారా…. ఈ చిట్కా వాడితే తక్షణమే మాయం…!!

ఓపెన్ ఫోర్స్.. చాలామంది సాధారణంగా ఎదుర్కొనే చర్మ సమస్యల్లో ఇది ఒకటి. ఓపెన్ సోర్స్ అంటే చర్మం మీద స్వేద గ్రంధులు తెరుచుకుని ఉండడమే. ఆరోగ్యపు అలవాట్లు, మేకప్ ఉత్పత్తులు, సన్ స్క్రీన్‌ను ఎవైడ్ చేయడం, హార్మోన్స్ చేంజ్ అవడం, చెమట ఉత్పత్తి అధికంగా ఉండటం, కాలుష్యం తదితర కారణాలు వల్ల ఓపెన్ పోర్స్ సమస్య ఎదురవుతుంది. దీని కారణంగా చెమట, మురికి ఎక్కువగా చేరి మొటిమలు, మచ్చలు, బ్లాక్ హెడ్స్ వంటివి వస్తాయి.

అందుకే ఓపెన్ పోర్స్ నుంచి బయటపడేందుకు చాలా ప్రయత్నిస్తారు. మీరు ఈ వ్యాధితో బాధపడుతున్నారా? ఎన్ని క్రీములు వాడిన సమస్య పోవడం లేదా? ఇప్పుడు చెప్పబోయే రెమెడీని పాటిస్తే చాలు ఈ సమస్య కు చెక్ పెట్టొచ్చు. ఆ రెమిడి ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా మిక్సీజార్ తీసుకుని.. అందులో నాలుగైదు రెబ్బలు వేపాకు వేసి మొత్తంగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసిన మిశ్రమం నుంచి వేపాకు జ్యూస్ ను సపరేట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో రెండు స్పూన్లు వేపాకు జ్యూస్ వేసుకోవాలి.

అలాగే వన్ టేబుల్ స్పూన్ అలోవెరా జెల్, వన్ టేబుల్ స్పూన్ రోజ్‌ వాటర్ వేసుకుని బాగా మిక్స్ చేయాలి. తర్వాత వన్ టేబుల్ స్పూన్ ఆరెంజ్ పీల్ పౌడర్ , వన్ టేబుల్ స్పూన్ శనగపిండి, రెండు చెక్కలు విటమిన్ ఈ ఆయిల్ వేసుకొని మరోసారి అన్ని బాగా మిక్స్ చేయాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ముఖం మొత్తానికి అప్లై చేసుకుని 20 నిమిషాల పాటు ఆరబెట్టాలి. ఆపై కూల్ వాటర్ తో చర్మాన్ని శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి. ఇలా రెండు రోజులకు ఒకసారి ఈ చిట్కాను వాడితే ఓపెన్ పోర్స్ వ్యాధి తగ్గిపోతుంది.