నటి షకీలా చేస్తున్న పనికి షాక్ లో ఫాన్స్..!!

నటి షకీలా పేరు వినగానే సిల్వర్ స్క్రీన్ పైన బోల్డ్ క్యారెక్టర్ గుర్తుకొస్తుంది.. అలా అలరించిన ఈమె గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. తమిళనాడులో ఒక ముస్లిం కుటుంబంలో జన్మించిన ఈమె ఆ తర్వాత స్టార్డంతో మంచి పాపులారిటీ అందుకున్నది. అప్పట్లోనే స్టార్ హీరోలకు సైతం అందుకునే రెమ్యూనరేషన్ అందుకునేదట. కుటుంబ పోషణ కోసం ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన షకీలా 18 ఏళ్లకే నటిగా మెప్పించింది. మలయాళం, తెలుగు, తమిళ సినిమాలలో నటించిన షకీలా ఎన్నో బోల్డ్ సినిమాలలో నటించింది.

అయితే షకీలా నిజజీవితంలో కూడా ఇలాగే ఉంటుందని చాలామంది అనుకుంటూ ఉంటారు.. అయితే అది పొరపాటే షకీలా తన కుటుంబ పోషణ కోసమే ఇండస్ట్రీలోకి అడుగు పెట్టానని చాలా సందర్భాలలో తెలియజేసింది. పైగా సినిమాలలో తనకు ఎదురైన కొన్ని చేదు అనుభవాలను కూడా ఇటీవలే పలు రకాల ఇంటర్వ్యూలలో తెలిపింది. నటిగ విరామం ఇచ్చాక పలుసేవ కార్యక్రమాలను కూడా చేపట్టినట్టు తెలుస్తోంది. ముఖ్యంగా 50 మంది ట్రాన్స్ జెండర్లకు ఆశ్రమం ఇస్తున్నట్టుగా తెలుస్తోంది.

Shakila (Shakeela) Enters Telugu Bigg Boss Season 7 - ITS - ITrendSpot

తన సొంత ఖర్చులతో వారిని కన్న బిడ్డలలా చూసుకుంటున్నానని గత కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉన్న షకీలా ఇది వలె బిగ్ బాస్ -7 లోకి కంటిస్టెంట్గా అడుగుపెట్టారు. హౌస్ లోకి రాగానే ఎమోషనల్ తన జీవితంలో ఎదుర్కొన్న చేదు అనుభవాలను తెలియజేసింది షకీలా.. పదవ తరగతి ఫెయిల్ కావడంతో తన తండ్రి చితక బాదాడని.. కుటుంబ పోషణ కోసమే ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాను ఒక మేకప్ మాన్ నన్ను సినిమాలలో పంపిస్తానన్నాడు.. అలా ఒక రోజు నేను సిల్క్ స్మిత ను చూశాను.. అలా ఒక సినిమాలో సిల్క్ స్మిత చెల్లెలి పాత్రలు ఎంపిక చేశారు. దీంతో తనను కుటుంబ సభ్యులు కూడా ఒక బంగారు బాతులా చూసారని నా డబ్బులు అన్ని మా అక్కే చూసుకునేది అయితే తను మాత్రమే బాగుపడింది.. ఒకానొక దశలో తన సినిమాలకు సెన్సార్ అనుమతి ఇవ్వలేదు దీంతో ఇంట్లోనే ఉండిపోయాను అంటూ ఎమోషనల్ అయింది షకీలా. షకీలా ఇలాంటి పనిచేస్తుందని తెలిసి అభిమానులు ఆశ్చర్యపోతున్నారు.