విశాల్ మ్యాజిక్ ..మార్క్ ఆందోళన ట్రైలర్..!!

కోలీవుడ్ లో స్టార్ హీరోగా పేరుపొందిన విశాల్.. పలు చిత్రాలలో నటిస్తూ బిజీగా ఉన్నారు. ఇటీవలే గ్యాంగ్ స్టార్ డ్రామాగా తెరకెక్కిస్తున్న మార్క్ ఆంటోని అనే చిత్రంలో నటించారు. ఈ సినిమా వినాయక చవితి సందర్భంగా ఈనెల 15వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ చిత్రానికి హై వోల్టేజ్ గ్యాంగ్స్టర్ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ డైరెక్టర్ ఎస్ వినోద్ కుమార్ నిర్మించారు. ఈ చిత్రంలో మరొక నటుడు డైరెక్టర్ ఎస్ జె సూర్య కీలకమైన పాత్రలో నటించారు. ఈ సినిమా ప్రమోషన్స్ లో బిజీగా ఉన్న చిత్ర బృందం ఇటీవల ఈ సినిమా ట్రైలర్ సైతం విడుదల చేశారు.

Mark Antony Movie (2023): Cast, Trailer, OTT, Songs, Release Date - News  Bugz

ఇందులో ఎస్ జె సూర్య విశాల్ ఇద్దరు కూడా మంచి స్నేహితులుగా కనిపిస్తూ ఉంటారు ఈ సినిమా ఒక టైం ట్రావెల్ కథ అంశంతో తెరకెక్కించినట్లు తెలుస్తోంది. టైటిల్ లో హీరో విశాల్ అనేక గెటప్పులలో కూడా కనిపిస్తూ ఉండడం గమనార్హం. రెండు పాత్రల మధ్య చాలా విభిన్నమైన వైవిధ్యాలు ఉన్నట్లుగా ట్రైలర్లు చూపించారు. ముఖ్యంగా ఇందులో హీరోతో పాటు విలన్ గా కూడా తనే నటించినట్లు కనిపిస్తోంది ఇందులో ఎస్ జె సూర్య కామెడీ కూడా అందరిని ఆకట్టుకునేలా కనిపిస్తోంది. హీరోయిన్గా రీతు వర్మ నటించిన ఇందులో సునీల్ కూడా నెగిటివ్ పాత్రలో కనిపించబోతున్నారు.

మార్కు ఆంటోని ట్రైలర్ అన్ని స్టన్స్ సీక్వెల్స్ కూడా హైలైట్ గా కనిపిస్తున్నాయి.. ట్రైలర్ ఈ సినిమా పైన భారీగా అంచనాలను పెంచేస్తోంది.ఈ చిత్రానికి సెల్వరాఘవన్ తదితరులు నటించిన ఈ సినిమాతో విశాల్ ఈసారైనా సక్సెస్ అవుతారేమో చూడాలి మరి. ప్రస్తుతం ఈ సినిమా ట్రైలర్ వైరల్ గా మారుతోంది. ట్రైలర్తో మ్యాజిక్ చేసిన విశాల్ సినిమాతో చేస్తారేమో చూడాలి మరి.