అన్నతో అక్రమ సంబంధం.. శ్రీ రెడ్డి సెన్సేషనల్ కామెంట్స్..!!

తరచూ రాజకీయ నాయకులపై.. సినీ ప్రముఖులపై వివాద‌స్ప‌ద‌ కామెంట్స్ చేస్తూ ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా నిలుస్తుంది శ్రీ రెడ్డి. తాజాగా ఉదయనిధి స్టాలిన్ అన్నతో ఎఫైర్ ఉందంటు.. నాపై కుట్ర చేస్తున్నారంటూ.. ఈ అమ్మడు తీవ్రంగా మండిపడింది. ” గతంలో గ్రీన్ పార్క్ హోటల్లో మేమిద్దరం శారీరకంగా కలిశామని.. నేనే స్వయంగా పోస్ట్ పెట్టానన్నారు.

ఆ పోస్ట్ నేను పెట్టలేదు. నాకేం తెలియదు. ఆయనను నేనెప్పుడూ కలవలేదు. ఉదయనిధి నాకు అన్నలాంటి వాడు. నా పేరు పై ఫేక్ ఎకౌంట్ క్రియేట్ చేసి.. ఈ విధంగా చేస్తున్నారని.. నకిలీ రూమర్స్‌ను నమ్మవద్దని ఎంత చెప్పిన అలాగే మాట్లాడుతున్నారు. ప్రస్తుతం ఆ రూమర్స్‌ను మళ్లీ ప్రచారం చేస్తున్నారు. ఎందుకంటే.. నేను ఇటీవలే రాజకీయాల్లో యాక్టివ్ అయ్యాను. ఆపోజిట్ పార్టీ తట్టుకోలేక నాపై తప్పుడు వార్తలు సృష్టిస్తూ.. వ్యక్తిగతంగా టార్గెట్ చేశారు.

ఏం పర్లేదు చేస్తే చేసుకోండి. కానీ నేను జనాలకు ఒక క్లారిటీ ఇవ్వాలి కాబట్టి చెబుతున్నాను. ఉదయనిధి స్టాలిన్ అన్నకు నాకు ఎలాంటి సంబంధం లేదు. అనవసరంగా లేనిపోనివి క్రియేట్ చేసి.. మీ ప్యూస్ కోసం తపించకండి”. అంటూ శ్రీరెడ్డి కామెంట్స్ చేసింది. ప్రస్తుతం ఈ బోల్డ్ భామ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.