సలార్ కొత్త రిలీజ్ డేట్.. డార్లింగ్ ఫాన్స్ ఆగ్రహం (వీడియో)

ప్రముఖ దర్శకుడు ప్రశాంత్ నీల్.. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక సినిమా ” సలార్ “. ఈనెల సెప్టెంబర్ 28న విడుదల కావాల్సిన ఈ సినిమా పలు కారణాల వల్ల వాయిదా పడింది. ఈ సినిమా ఎందుకు వాయిదా పడిందంటూ సోషల్ మీడియాలో అనేక రకాల వార్తలు వస్తున్నాయి. ఇక డార్లింగ్ ఫాన్స్ అయితే చాలా కంగారు పడుతున్నారు.

సినిమా షూటింగ్ మొత్తం పూర్తయ్యాక రిలీజ్ డేట్స్ ఎందుకు మార్చాల్సి వస్తుందని వచ్చే వార్తలపై మేకర్స్ కూడా రెస్పాండ్ అవ్వడం లేదని నెటిజెన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే తాజాగా ఈ సినిమా నవంబర్ 10న రిలీజ్ కాబోతుందని.. కొత్త విడుదల డేట్ ఇదేనంటూ టాక్ వినిపిస్తుంది. ఆల్రెడీ సెప్టెంబర్ 28న సలార్ రావట్లేదని.. చాలా సినిమాలు ఆ తేదీని లాక్ చేసుకున్నాయి.

దీంతో దీపావళి సందర్భంగా నవంబర్‌లో కన్ఫామ్ గా వస్తుందా? అని సందేహంలో ఉన్నారు జనాలు. ఎందుకంటే మేకర్స్ నుంచి ఎటువంటి రియాక్షన్ లేదు. పైగా రెండు, మూడు రోజుల్లో క్లారిటీ వస్తుందని అంటున్నారు. దీనిపై మేకర్స్ ఖచ్చితంగా స్పందించాలంటున్నారు ఫాన్స్.