సరస్వతి ఆకుతో పిల్లల మంచి ఆరోగ్యం..!!

సరస్వతి ఆకు.. ఈ పేరు వినే ఉంటారు. సరస్వతి ఆకును చాలామంది బ్రహ్మ ఆకు అని కూడా పిలుస్తారు. ఆయుర్వేద వైద్యంలో ఈ ఆకులు ఎక్కువగా ఉపయోగిస్తారు. అనేక జబ్బులకు చెక్ పెట్టేందుకు సరస్వతి ఆకు అద్భుతంగా పనిచేస్తుంది. అలాగే పిల్లలు ఆరోగ్యానికి కూడా సరస్వతి ఆకు చాలా మేలు చేస్తుంది.

ముఖ్యంగా సరస్వతి ఆకులు.. ఇప్పుడు చెప్పబోయే విధంగా ప్రతిరోజు పిల్లలకి ఇస్తే ఇక వారి ఆరోగ్యానికి తిరుగు ఉండదు. అందుకోసం ముందుగా సరస్వతి ఆకులను బాగా ఎండ పెట్టుకోవాలి. పూర్తిగా ఎండిన తరువాత వాటిని మిక్సీ జార్ లో వేసి పొడిగా చేసుకోవాలి.

దాన్ని ఒక బౌల్ లో తీసుకుని స్టోర్స్ చేసుకోవాలి. ప్రతిరోజు ఉదయం ఒక గ్లాసు గోరువెచ్చని ఆవు పాలు తీసుకుని అందులో అర టేబుల్ స్పూన్ సరస్వతి ఆకు పొడి, చిటికెడు మిరియాల పొడి, రుచికి సరిపడ్డ పటికి బెల్లం వేసి బాగా కలపాలి. ఇప్పుడు ఈ పాలను మీ పిల్లల చేత తాగించాలి. ఈ విధంగా కనుక సరస్వతి ఆకును ప్రతి రోజు పిల్లలకు ఇస్తే వారి ఆరోగ్యం, మెదడు పనితీరు పుష్కలంగా ఉంటాయి.