రామ్ చరణ్ కి షాక్ ఇస్తున్న ఫ్యాన్.. సూసైడ్ నోట్ వైరల్..!!

రామ్ చరణ్ హీరోగా డైరెక్టర్ శంకర్ కాంబినేషన్లో వస్తున్న తాజా చిత్రం గేమ్ చేంజర్. ఈ సినిమాని దిల్ రాజు భారీ బడ్జెట్ తో నిర్మిస్తూ ఉన్నారు. అన్ని భాషలలో ఒకేసారి ఈ సినిమాని తెరకెక్కిస్తూ ఉన్నారు. హీరోయిన్గా కీయారా అద్వానీ నటిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా విడుదల తేదీ వాయిదా పడినట్టుగా కూడా వార్తలు వినిపిస్తున్నాయి. 2025 లో ఈ సినిమా విడుదల కాబోతున్నట్లు సమాచారం. అయితే ఎప్పుడెప్పుడు అభిమానులు ఈ సినిమా విడుదలవుతుందంటే చాలా ఆతృతగా ఎదురు చూస్తున్నారు.

ఈ సినిమా విడుదల తేదీ పై చిత్ర బృందం స్పందించకపోవడంతో తాజాగా రామ్ చరణ్ వీర అభిమాని నిర్మాతకు సైతం సూసైడ్ నోట్ ను రాసినట్లుగా తెలుస్తోంది.. ఈ సూసైడ్ నోట్ లో గేమ్ చేంజెర్ సినిమా రిలీజ్ డేట్ పై క్లారిటీ ఇవ్వకపోతే చనిపోతానంటు బెదిరిస్తున్నారు. ప్రస్తుతం రామ్ చరణ్ అభిమాని రాసిన లేక సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది.. ఇందులో అభిమాని ఇలా రాస్తూ నేను ఈ కఠినమైన నిర్ణయం ఎందుకు తీసుకున్నాను అంటే రామ్ చరణ్ వీరాభిమానిగా దాదాపుగా రెండేళ్ల పాటు రాబోయే సినిమా గేమ్ చేంజర్ సినిమా కోసం ఎంతో ఓపికగా చూశాను దురదృష్టవశాత్తు ప్రొడక్షన్ టీం నుంచి ఎటువంటి అప్డేట్లు కూడా రాలేదు.. సినిమా విడుదల తేదీని కూడా ప్రకటించలేదు..

నేను వారికి మూడు రోజులు గడువు ఇస్తున్నాను లేకపోతే నా జీవితాన్ని ముగించేస్తాను ఇదే నా చావుకు ప్రధాన కారణం అవుతుంది అంటూ శంకర్ షణ్ముగం.. దిల్ రాజు అండ్ SVC ప్రొడక్షన్ హౌసే కారణమంటూ తెలియజేశారు. మీరు నా నిర్ణయాన్ని అర్థం చేసుకోగలరని నేను ఆశిస్తున్నాను లవ్ యు చరణ్ అన్న నిన్ను చాలా మిస్ అవుతున్నాను అంటూ ఈ లెటర్ ని రాసుకోవడం జరిగింది. ఈ లెటర్ ని బాబు గౌడ్ అని రాశారు.