యాక్టర్ హరితేజ డివోర్స్.. వైరల్ అవుతున్న పోస్ట్..!

టాలీవుడ్ యాక్టర్ హరితేజ అటు పులితరపై ఇటు వెండితెరపై కూడా తనకంటూ ఒక ప్రత్యేకమైన క్రేజ్ ను దక్కించుకుంది. యాంకర్‌గా రాణించిన హరితేజ ఆన్‌స్క్రీన్‌పైనే కాదు ఆఫ్ స్క్రీన్ లో కూడా ఎంత చలాకీగా ఉంటూ అందర్నీ నవ్విస్తూ ఉంటుంది. సినిమాలో తన యాక్టింగ్‌తో అలరించిన ఆమె బుల్లితెర షోలో కూడా తనదైన పంచ్‌లు డైలాగులతో అందరినీ నవ్విస్తుంది. సాటైరికల్ కామెంట్స్‌తో ఇంచుమించు మరో సూర్యకాంతంల గుర్తింపు తెచ్చుకుందంటూ ఓ ఈవెంట్లో మాటలు మాంత్రికుడు స్వయంగా చెప్పుకొచ్చాడు. అందుకే ఆమెకు నితిన్ – సమంత కాంబినేషన్ లో వచ్చిన అఆ మూవీలో ఛాన్స్ ఇచ్చాడు త్రివిక్రమ్.

బిగ్ బాస్ 5లో అడుగుపెట్టిన హరితేజ టాప్ పై కంటెస్టెంట్ లో ఒకటిగా నిలిచి తన సత్తా చాటుకుంది. ఇక కన్నడకు చెందిన దీపక్ అనే వ్యక్తిని 2005లో వివాహం చేసుకున్న హ‌రి 2021లో భూమి అనే ఒక బుజ్జి పాపకు జన్మనిచ్చింది. పాప పుట్టిన తర్వాత హరితేజ కొద్దిగా బరువు పెరిగిన తర్వాత ఎన్నో కష్టాలు పడి మరి బరువు తగ్గించుకుని స్లిమ్‌గా తయారైంది. తాజాగా ఈ బ్యూటీ ఆస్ట్రేలియాలో సింగిల్ గా వెకేషన్ లో ఎంజాయ్ చేసింది. కుమార్తెను కూడా తన తల్లి దగ్గర వదిలి ఆమె ఎంజాయ్ చేస్తున్న ఆ వీడియోస్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ నేపథ్యంలో చాలా రోజుల తర్వాత అభిమానులతో చిట్ చాట్ ప్రారంభించింది హరితేజ.

ఇందులో నేటిజన్లో అడిగే ప్రశ్నలకు ఎంతో ఆసక్తికరమైన సమాధానాలు చెప్పుకొచ్చింది. మీ భర్త దీపక్ తో మీరు విడాకులు తీసుకున్నారా..? అంటూ ఓ నెటిస‌న్‌ ప్రశ్నించాడు. దీనికి హరితేజ కూడా నవ్వుతూ చాలా హుందాగా తన స్టైల్ లో సమాధానం చెప్పింది. నాలుగు రోజులు సోషల్ మీడియాలో యాక్టివ్గా లేకపోతే మనుషులు కూడా చంపేసేలా ఉన్నారు అంటూ కామెంట్ చేసింది. తన భర్తతో ఉన్న ఫోటోను షేర్ చేసి విడాకుల కామెంట్లకు ఫుల్ స్టాప్ పెట్టింది. ఇక ఇదే చిట్ చాట్ లో మరో నేటిజన్ మీరు బుల్లితెర సీరియల్ నటి నవ్యతో విడిపోయారా..? అంటూ అడగ్గా అది అవ్వదు అమ్మ అంటూ తమ ఇద్దరి మధ్య ఉన్న స్నేహ ఎంతో బలమైందంటూ చెప్పుకొచ్చింది.