” ఆమె ఈ సినిమాలో ఉంటే నేను నటించను “.. మొఖం మీదే చెప్పేసిన రామ్ చరణ్..!!

చాలామంది చరణ్ సాఫ్ట్ మైండెడ్ అని అనుకుంటూ ఉంటారు.. కానీ కానే కాదు అంటున్నారు సినీ విశ్లేషకులు. మెగాస్టార్ తనయుడు రామ్ చరణ్ అన్నిటిలో చాలా తెలివిగా వ్యవహరిస్తూ ఉంటాడని ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మరి ముఖ్యంగా ” గోవిందుడు అందరివాడేలే ” మూవీ షూటింగ్ టైంలో కృష్ణ వంశీని ముప్పు తిప్పలు పెట్టాడట.

నిజానికి జయసుధ రోల్లో కృష్ణవంశీ రోజాను ఎంపిక చేశాడట. అయితే చరణ్ కి ఈ విషయం లాస్ట్ మూమెంట్ వరకు తెలియదు. లాస్ట్ కి ఈ విషయం చరణ్ కు తెలిసిన తరువాత…” నేను ఈ సినిమా నుంచి తప్పుకుంటాను.. ఆమె ఉంటే నేను ఈ సినిమాలో నటించను ” అంటూ మొండికేశాడట. అప్పటివరకు రోజా పై ఎటువంటి సీన్ మొదలుపెట్టలేదు.

కానీ చరణ్ పై మాత్రం ఒక మూడు నాలుగు సీన్స్ చిత్రీకరించాడు. ఈ సమయంలో చరణ్ తప్పుకుంటే మరో పెద్ద హీరో దొరకడు.. అనే భయంతో రోజానే.. ఈ సినిమా నుంచి తీసేసి జయసుధని పెట్టారట. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.