చంద్రముఖి 2 కోసం లారెన్స్ పుచ్చుకున్నది ఎంతో తెలుసా..?

చంద్రముఖి సీక్వెల్ గా వచ్చిన చంద్రముఖి 2 ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుందనే వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఒక వర్గం ప్రేక్షకులను మాత్రం ఈ సినిమా మెప్పించలేదని కామెంట్లు వినిపిస్తూ ఉండడం గమనార్హం. రాఘవ లారెన్స్ హీరోగా.. పి. వాసు దర్శకత్వంలో వచ్చిన హర్రర్ కామెడీ చిత్రం చంద్రముఖి 2 మొన్న గురువారం అనగా సెప్టెంబర్ 28వ తేదీన థియేటర్లలో విడుదలైంది. దాదాపు 14 సంవత్సరాల క్రితం రజనీకాంత్, పి . వాసూ కాంబినేషన్లో వచ్చి అప్పట్లో తెలుగు, తమిళ్ భాషలలో ఘనవిజయాన్ని సాధించిన చంద్రముఖి చిత్రానికి సీక్వెల్ గా వచ్చిన ఈ సినిమాలో ఈసారి ప్రధాన తారాగణం మొత్తం మారిపోయిందనే చెప్పాలి.

Chandramukhi 2 Review: A Poorly-Acted Sequel That Isn't Even A Ghost Of Its  Original

రజనీకాంత్ స్థానంలో రాఘవ లారెన్స్ హీరోగా చేయగా.. జ్యోతిక పాత్రలో చంద్రముఖి గా కంగనా రనౌత్ పాత్ర పోషించారు. కానీ జ్యోతిక లెవెల్లో ఆమె ఆకట్టుకోలేకపోయింది. అయితే ఈ చిత్రానికి భారీగానే బడ్జెట్ కేటాయించారు .ఈ క్రమంలోనే ఈ సినిమా కోసం రాఘవ లారెన్స్ ఎంత రెమ్యునరేషన్ తీసుకున్నారు అనేది ఇప్పుడు తమిళనాట హాట్ టాపిక్ గా మారింది. ఇకపోతే తమిళ సినీ వర్గాల నుంచి తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం చంద్రముఖి 2 సినిమా కోసం లారెన్స్ ఏకంగా 30 కోట్ల రూపాయలను తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఇంత పెద్ద మొత్తం ఎవరు ఊహించలేదని సమాచారం.

 

ఏదేమైనా రాఘవ లారెన్స్ ఈ సినిమా కోసం భారీగానే పారితోషకం తీసుకున్నారని తెలుస్తోంది. ఇకపోతే సినిమా విషయానికి వస్తే మొదటి సినిమాలాగే ఇంట్రడక్షన్ ఫైట్, పాటలతో చాలా రొటీన్ గానే మొదలయింది. అయితే స్క్రీన్ ప్లే క్యారెక్టర్ అన్నింటి విషయంలో కూడా చంద్రముఖిని ఫాలో అయ్యారు. ముఖ్యంగా చంద్రముఖి పట్టిన పాత్రను ఇంటర్వెల్ కు పరిచయం చేయడం, ఫ్లాష్ బ్యాక్ ను మార్చి నిడివి పెంచడం మాత్రమే చేశారు. మిగతాదంతా ప్రేక్షకులను పెద్దగా మెప్పించలేక పోయింది.