అప్పుడే ” భగవంత్ కేసరి ” అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్.. ఏ యేరియాలో అంటే..

నందమూరి నటసింహం బాలయ్య ఈ సంవత్సరం సంక్రాంతి కానుకగా విడుదల అయినటువంటి వీర సింహారెడ్డి మూవీతో బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. ఇకపోతే బాలయ్య తాజాగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతున్న భగవంత్ కేసరి అనే సినిమాలో హీరోగా నటిస్తున్న సంగతి మన అందరికీ తెలిసిందే. కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో శ్రీకాంత్ ముఖ్యమైన పాత్రలో కనిపించనుండగా… శ్రీ లీల ఈ సినిమాలో బాలయ్య కి కూతురుగా నటిస్తుంది.

తమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాని షైన్స్ స్క్రీన్ బ్యానర్ వారు నిర్మిస్తున్నారు. ఇకపోతే ఈ సినిమాని ఈ సంవత్సరం అక్టోబర్ 19న విడుదల చేయనున్నట్లు ఈ సినీ బృందం చాలా రోజుల క్రితమే అధికారిక ప్రకటన ఇచ్చింది. తాజాగా ఈ మూవీ మేకర్స్ ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్‌ కూడా పూర్తి చేసుకున్నారు. అలాగే ఇప్పటికే ఈ సినిమా చాలా వరకు ఎడిటింగ్ మరియు డబ్బింగ్ పనులు కూడా పూర్తయ్యాయి. మరికొన్ని రోజుల్లోనే ఈ మూవీకి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా అన్ని పూర్తి కాబోతున్నట్లు సమాచారం.

ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ మేకర్స్… ఈ సినిమాకు సంబంధించిన ఓ క్రేజీ అప్డేట్‌ ప్రకటించారు. ఈ సినిమాను ఓవర్‌సీస్ లో సరిగమ సినిమాస్ సంస్థ విడుదల చేయబోతున్నట్లు.. అలాగే ఈ మూవీ యొక్క ” యుఎస్ఏ ” బుకింగ్స్ ను ఓపెన్ చేసినట్లు ఈ మూవీ బృందం అధికారిక ప్రకటన ఇచ్చింది. అఖండ, వీర సింహారెడ్డి లాంటి వరుస విజయాల తరువాత బాలయ్య నటించిన సినిమా కావడంతో ఈ సినిమాపై ప్రేక్షకులలో మంచి అంచనాలు నెలకొని ఉన్నాయి.