ప్రకాష్ రాజ్ కి పోటీ ఇస్తున్న నటుడు ఎవరో తెలుసా..?

ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో తనకంటూ ఒక గుర్తింపు సంపాదించుకున్న నటులలో ప్రకాష్ రాజు కూడా ఒకరు.. ఎన్నో విభిన్నమైన చిత్రాలలో హీరోగా విలన్ గా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించి మంచి క్రేజ్ అందుకున్న ప్రకాష్ రాజ్ కి ఈ మధ్యకాలంలో పెద్దగా సక్సెస్ లు అందుకోలేకపోతున్నారు. అయితే ప్రకాష్ రాజ్ లాంటి యాక్టర్స్ టాలీవుడ్ లో రావు రమేష్ కూడా ఒకరని చెప్పవచ్చు. ఈయన చేసిన ఎన్నో సినిమాలలో క్యారెక్టర్ ప్రేక్షకులను బాగా గుర్తుండిపోయేలా చేస్తూ ఉన్నాయి.

ఈయన చేసిన ప్రతి సినిమాలోని క్యారెక్టర్లు కూడా స్పెషల్ అని చెప్పవచ్చు. ఎందుకంటే ఎవరైనా సరే ఒక నటుడు ఒక సినిమా చేస్తున్నాడు అంటే ఆ నటుడు చేసే నటన మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. వాస్తవానికి సినిమాలలో ఒక క్యారెక్టర్ చేయడానికి అందులో అవకాశం రావడానికి చాలామంది పలు రకాలుగా ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు. ఇండస్ట్రీలో ఒక్కసారి అవకాశం వచ్చిందంటే చాలు ప్రతి ఒక్కరు తమ టాలెంట్ నిరూపించుకోవడానికి ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు.

సినిమా మీద ఇంట్రెస్ట్ ఉన్న రావు రమేష్ మాత్రం ఇండస్ట్రీలోకి రాకముందు చాలా ఇబ్బందులు పడ్డారట. ఈయన నటుడుగా చేసిన మొదటి సినిమా గమ్యం.. ఈ సినిమాలో ఒక డిఫరెంట్ క్యారెక్టర్ తో ప్రేక్షకులను మెప్పించారు.. వాస్తవానికి ఈయన చేసిన ఆ క్యారెక్టర్ సినిమాకి హైలైట్ గా ఆకట్టుకుంది ఈ సినిమా సక్సెస్ అవ్వడంతో కొత్త బంగారులోకం సినిమాలు అవకాశాన్ని అందుకున్నారు. ఆ తర్వాత సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాతో మరొకస్థాయి పెంచుకున్నారు రావు రమేష్. రావు రమేష్ లెజెండ్రీ నటుడు రావు గోపాల్ రావు కుమారుడు. ఈ మధ్యకాలంలో రావు రమేష్ ప్రకాష్ రాజ్ ని మించిపోయి నటిస్తూ ఉన్నారు.