ఇండస్ట్రీ లోకి రాక ముందు తాప్సి ఎలాంటి పని చేసేదో తెలుసా..?

టాలీవుడ్ హీరోయిన్ తాప్సీ ఢిల్లీలో పుట్టిన ఈ ముద్దుగుమ్మ మొదట మోడలింగ్ గా తన కెరీర్ ని ప్రారంభించి..ఆ తర్వాత ఇండస్ట్రీలోకి హీరోయిన్గా ఎంట్రి ఇచ్చింది.. ఇమే తండ్రి కూడా ఒక బిజినెస్ మ్యాన్.. అందుచేతనే ఈమె కూడా ఎప్పుడు హీరోయిన్ అవ్వాలని కలకనలేదట. కేవలం ఒక బిజినెస్ మ్యాన్ గానే ఉండాలనుకుందట. కానీ అనుకోకుండా సినిమాల లోకి వచ్చి నార్త్ సౌత్ ఇండస్ట్రీలో మంచి పాపులారిటీ అందుకుంది.సినిమాలలోకి రాకముందు ఏం పని చేసేది ఎవరికి తెలియకపోవచ్చు..

Shabaash Mithu:लीक से हटकर चलने के लिए मशहूर हैं तापसी पन्नू, इन किरदारों  से कर चुकी हैं इंप्रेस - Shabaash Mithu Film Actress Taapsee Pannu Top 5  Movies From Thappad To Naam

పూర్తి వివరాల్లోకి వెళితే డైరెక్టర్ రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన మంచు మనోజ్ హీరోగా నటించిన ఝుమ్మందినాదం సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయమైంది. ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన కొత్తలో సెకండ్ హీరోయిన్ గా పలు సినిమాలలో నటించింది.. అయితే తమిళంలో ఈమెకు హీరోయిన్ గా ఆఫర్లు రావడంతో అక్కడ బ్యాక్ టు బ్యాక్ సినిమాలలో నటించి మంచి పొజిషన్లో పేరు సంపాదించింది. అయినప్పటికీ కూడా ఈ ముద్దుగుమ్మ బాలీవుడ్ కి వెళ్లి అక్కడ చాలా మంది స్టార్ హీరోల సరసన నటించి మంచి క్రేజ్ సంపాదించుకుంది. తాప్సి లేడీ ఓరియంటెడ్ చిత్రాలలో నటించి నిర్మాతగా కూడా మారింది.

Taapsee Pannu shares pic of her big, happy family from last year's Raksha  Bandhan: 'This year things will be different' | Bollywood - Hindustan Times

తాప్సి సినిమాలలోకి రాకముందు సాఫ్ట్వేర్ ఉద్యోగిగా కూడా పని చేసిందట. అయితే సినిమాల పైన తనకు ఎలాంటి ఇంట్రెస్ట్ లేకపోవడంతో తన స్నేహితుడు చెప్పడంతో నువ్వు హీరోయిన్ గా అయితే చాలా బాగుంటావని చెప్పి ఒకసారి ట్రై చేయమని ఆడిషన్ కి సైతం తమ ఫోటోలను పంపించారట.. అలా ఒకవైపు సాఫ్ట్వేర్ జాబ్ చేస్తూనే మరొకవైపు మోడలింగ్ చేస్తూ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది తాప్సి. హీరోయిన్గా అవకాశం రావడంతో ఉద్యోగం మానేసి ఇండస్ట్రీలో సెటిల్ అయిపోయింది.