అదృష్టం అంటే రష్మికదే.. ఆ అవార్డు రేసులో రష్మిక..!!

పాన్ ఇండియన్ హీరోయిన్ గా పేరు పొందిన రష్మిక కెరియర్లో ప్రస్తుతం ఫుల్ బిజీగా ఉంటోంది. కిరిక్ పార్టీ సినిమా ద్వారా మొదటిసారి కన్నడ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన రష్మిక ఛలో,గీతగోవిందం సినిమాతో తెలుగు తెరకు పరిచయమయి మంచి పాపులారిటీ సంపాదించుకుంది. అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ గా పాపులారిటీ అందుకున్న ఈ ముద్దుగుమ్మ బాలీవుడ్ లో కూడా తనదైన స్టైల్ లో హవా కొనసాగిస్తూ ఉంటోంది. ఇదంతా ఇలా ఉంటే రష్మిక అభిమానులు ఫుల్ ఖుషి అయ్యేలా ఒక వార్త వినిపిస్తోంది.

ఇప్పటికే రష్మీక కొన్ని ఫిలింఫేర్ సైమ అవార్డులను కూడా గెలుచుకున్నది..ఇప్పుడు రష్మిక మందన ప్రతిష్టాత్మకంగా అవార్డుకు ఎంపికైనట్టుగా తెలుస్తోంది.. ఉత్తమ ఆసియా నటి విభాగం నుంచి రష్మిక పేరు సేఫ్టీఎస్ అవార్డుకు ఎంపికైనట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.. ఈ విభాగంలో రష్మికకు గట్టి పోటీ కూడా ఉన్నట్లు తెలుస్తోంది. కానీ పలువురు నేటిజన్స్ మాత్రం రష్మికనే గెలిచే అవకాశం ఉన్నట్లు కామెంట్లు చేస్తున్నారు. దాదాపుగా ఎనిమిది మంది నటీమణులు ఈ అవార్డుకు పోటీ పడుతున్నట్లు సమాచారం.

Rashmika Mandanna:रश्मिका के साथ जमेगी धनुष की जोड़ी, इस फिल्म में साथ नजर आएंगे दोनों सितारे - Rashmika Mandanna To Share Screen Space With Dhanush In D51 Directed By Sekhar Kammula Know

ఇతర ఆసియా దేశాల నుంచి నటిమనులు కూడా ఈ అవార్డు కోసం పోటీ పడుతున్నట్లు తెలుస్తోంది.. ఇదే విభాగంలో నుంచి ఇండియాకు చెందిన నమిత లాల్ కూడా నామినేట్ అయినట్లు సమాచారం. ఈమె నిర్మాతగా కూడా మంచి పాపులారిటీ అందుకున్నది. అలాగే మలయాళ నటుడు టోవినో థామస్ ఉత్తమ ఆసియా నటుడు నుంచి నామినేట్ అయ్యాడు. ప్రముఖ హిందీ యూట్యూబర్ భువన్ బాంబు కూడా ఉత్తమ ఆసియా విభాగం నుండి నామినేట్ కావడం గమనార్హం.. అలాగే మలయాళ చిత్రం 2018 కూడా ఉత్తమ ఆసియా చిత్రాల జాబితాలో నామినేట్ అయినట్లు తెలుస్తోంది.