టాలీవుడ్ హీరో నాగచైతన్య అక్కినేని హీరోగా మంచి పాపులారిటీ సంపాదించారు.. ముఖ్యంగా సోషల్ మీడియాలో తరచూ చైతన్య పేరు వినిపిస్తూనే ఉంటుంది.. నాగచైతన్య ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఇప్పటికి 14 ఏళ్ళు పూర్తి అయినప్పటికీ.. నాగచైతన్య నటించిన మొదటి చిత్రం జోష్ ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. కానీ నాగచైతన్య తనలో ఉండే టాలెంట్ ను సైతం ఈ సినిమాలో చూపించారు. నాగచైతన్య పర్సనల్ లైఫ్ గురించి ఎప్పుడూ కూడా ఏదో ఒక రూమర్ వినిపిస్తూనే ఉంటుంది..
సమంతతో లవ్, పెళ్ళి ,విడాకుల తర్వాత కెరియర్ మీద ఫోకస్ పెట్టిన ఇంకొక మరొక హీరోయిన్ శోభిత ధూళిపాళ్లతో రిలేషన్ లో ఉన్నారంటూ వార్తలు వినిపిస్తూ ఉంటాయి.. ఈ విషయంపై శోభిత స్పందించిన చైతన్య మాత్రం ఇప్పటివరకు అది నిజం కాదని విషయాన్ని చెప్పలేదు.. దీంతో వీరిద్దరి మధ్య రిలేషన్ ఉందా లేదా అనే విషయం పైన అభిమానులు ఇప్పటికీ కన్ఫ్యూజన్ గానే ఉన్నారు.. అప్పుడప్పుడు మాత్రం వీరి రిలేషన్ లో ఉన్నట్లు కొన్ని అనుమానాలు వచ్చేలా ప్రవర్తిస్తూ ఉంటారు.. గతంలో వీరిద్దరూ ఒక రెస్టారెంట్ లో కూడా కలిసి కనిపించారు.. ఆ ఫోటో ఎంతటి పాపులారిటీ అయ్యిందో చెప్పాల్సిన పనిలేదు.
ఇప్పుడు తాజాగా చైతన్య రిఫర్ చేసిన పుస్తకాన్ని పట్టుకొని శోభిత ఫోటోలకు ఫోజులు ఇచ్చింది.. అయితే ఇది కేవలం కో ఇన్సిడెంట్ అయితే కావచ్చు కానీ అభిమానులు మాత్రం వీరిద్దరి మధ్య ఏదో ఉందంటూ మరొకసారి వైరల్ గా చేస్తున్నారు.. గత కొద్ది రోజుల క్రితం నాగచైతన్య గ్రీన్ లైట్స్ అనే పుస్తకాన్ని చెబుతూ జీవితానికి ఒక ప్రేమ లేఖ మీ ప్రయాణాన్ని మాతో పంచుకున్నందుకు థాంక్స్ అంటూ ఒక ట్విట్ చేశారు అయితే ఇప్పుడు తాజాగా ఇదే బుక్కును శోభితా షేర్ చేస్తూ.. గత కొన్ని నెలలుగా నేను చదివిన అత్యుత్తమ పుస్తకం ఎంతో అపురూపమైన జీవిత కథ ఒక పాట లాగా నిజంగా విపరీతమైన నవ్వు ఏదో స్వాతంత్రాన్ని సంపాదించిన రుచులా ఉంది అంటూ చెప్పుకొచ్చింది. ఇది చూసిన నేటిజన్స్ పలు రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు.