తెరపై మీరు చూసే గ్లామర్ వెనుక ఎన్నో బాధలు ఉంటాయి.. టాప్ హీరోయిన్ కామెంట్స్ వైరల్..

గతంలో దేశాన్ని ఓ ఊపు ఊపిన రెయిన్ సాంగ్ ‘ టిప్ టిప్ బార్స పానీ ‘.. 1994లో రిలీజైన ” మెహ్రా ” సినిమాలో ఈ పాట ఎంత పాపులారిటీ దక్కించుకుందో తెలుసు. అక్షయ్ కుమార్ హీరోగా రవీనా టాండ‌న్ హీరోయిన్గా నటించిన ఈ మూవీలో ఈ ఐకానిక్ పాట గురించి ఇటీవల రవినా తండన్‌ స్పందించింది. తాజాగా ఆ పాట గురించి ఆమె మాట్లాడుతూ కొన్ని ఆసక్తికర విషయాలను షేర్ చేసుకుంది. అప్పట్లో ఈ సాంగ్ షూట్ కన్స్ట్రక్షన్ స్టేజ్ లో ఉన్న ఓ బిల్డింగ్ లో జరిగిందని.. ఆ షూటింగ్ టైంలో నేను చాలా ఇబ్బంది పడ్డాన‌ని చెప్పింది.

అక్కడ చుట్టూ ఇనుప ముక్కలు, అపరిశుభ్ర వాతావరణం ఉందని.. దాంతో పాటే షూటింగ్ టైంలో కూడా చాలా కష్టపడాల్సి వచ్చిందని.. చెప్పులు లేకుండా చీర కట్టుకుని వర్షంలో మూమెంట్స్ చేయడం కష్టంగా అనిపించిందని చెప్పకొచ్చింది. షూటింగ్ పూర్తయిన తర్వాత ఇంటికి వెళ్లి చూసుకుంటే మోకాళ్ళకు బాగా గాయాలు అయ్యాయని ఆ బాధను భరించలేకపోయానని హాస్పిటల్ కి వెళ్లి టిటి ఇంజక్షన్ తీసుకోవాల్సి వచ్చిందని వివ‌రించింది.

ఆ పాట షూటింగ్ దెబ్బకి సుమారు మూడు రోజులు నేను అనారోగ్యానికి గురయ్యానని తెరపై ప్రేక్షకులు చూసే గ్లామర్.. తెరవెనక చెప్పలేనని కథలు దాచిపెడుతుంది.. రిహార్సల్స్ టైంలో కూడా ఇలాగే ఎన్నో సమస్యలు పడిన అది విడుదలైన తర్వాత ప్రేక్షకుల నుంచి వచ్చే పాజిటివ్ రెస్పాన్స్ తో ఆ బాధలన్నీ మర్చిపోతామని.. రవినా టాండ‌న్ వివరించింది. ఇదే సాంగ్ 2021 లో రిలీజ్ అయిన ” సూర్యవంశం ” సినిమాలో కూడా రీమేక్ చేశారు. అందులో అక్షయ్ కుమార్, కత్రినా కైఫ్ జ‌త‌క‌ట్టారు.