ప్రభాస్, మారుతి సినిమాపై మరో కొత్త అప్డేట్..?

కమర్షియల్ డైరెక్టర్ మారుతి.. పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ తో ఓ భారీ చిత్రం తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఈ సినిమా గురించి మరో అప్డేట్ వినిపిస్తుంది. ఈ సినిమా ప్రభాస్ టైప్ ఫక్తు యాక్షన్ డ్రామా కాదట.. ఇదోక ఫ్యామిలీ బ్యాక్ డ్రాప్ తో సాగే కామెడీ డ్రామా అని ఇప్పటికే వార్తలు వచ్చాయి.

ఇప్పుడు ప్రభాస్ క్యారెక్టర్ పై మరో రూమర్ వినిపిస్తుంది. ఈ సినిమాలో ప్రభాస్ డ్యూయల్ రోల్లో కనిపించనున్నాడని.. ముఖ్యంగా ఫ్లాష్ బ్యాక్ లో వచ్చే ప్రభాస్ ఓల్డ్ క్యారెక్టర్ కి ఓ వీక్నెస్ ఉంటుందని.. ఆ వీక్నెస్ ఆధారంగా వచ్చే సీక్వెన్సెస్ ఫుల్ ఎంటర్టైనర్ గా ఉంటాయని సమాచారం. మరి ఈ మూవీలో మారుతి ప్రభాస్ ఫ్యాన్స్ కోసం ఇంకా ఎలాంటి ఎలిమెంట్స్ రాశాడో చూడాల్సి ఉంది.

సహజంగా మారుతి అంటేనే.. చిన్న చిన్న పాత్రలతోనే ఫుల్ కామెడీ పండిస్తాడు. మరి ప్రభాస్ సినిమాతో ఏ రేంజ్ కామెడీ పండిస్తాడో చూడాలి. ఇక ఈ సినిమా ట్రైలర్ కోసం ‘ రాయల్ ,అంబాసిడర్ ‘ అనే టైటిల్ ను పరిశీలిస్తున్నట్లు టాక్. రాయల్ అనే టైటిల్ పైనే మేకర్స్ ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు. మొత్తానికి మారుతి ఈ ప్రాజెక్ట్ కోసం అద్భుతమైన కామెడీ ట్రాక్ ను సిద్ధం చేశాడట.