నాగార్జున‌ సూప‌ర్ హిట్ సాంగ్ కు అమ‌ల అదిరిపోయే స్టెప్పులు.. వీడియో చూస్తే షాకైపోతారు!

టాలీవుడ్ లో మోస్ట్ ల‌వ‌బుల్ క‌పుల్స్ లిస్ట్ లో అక్కినేని నాగార్జున‌-అమ‌ల జంట ఒక‌టి. వెంక‌టేష్ సోద‌రి ల‌క్ష్మీతో విడాకులు తీసుకున్న త‌ర్వాత నాగార్జున‌.. త‌న స‌హ న‌టి అమ‌ల‌తో ప్రేమ‌లో ప‌డ్డారు. అంద‌రినీ ఒప్పించి ఆమె మెడ‌లో మూడు ముళ్లు వేశాడు. వివాహం అనంత‌రం సినిమాల‌కు దూర‌మైన అమ‌ల‌.. హోమ్ బ్యాన‌ర్ అయిన అన్న‌పూర్ణ స్టూడియోస్ బాధ్య‌త‌ల‌ను తీసుకుంది.

అలాగే అనేక సేవా కార్య‌క్ర‌మాలను నిర్వ‌హిస్తూ గొప్ప మ‌న‌సును చాటుకుంటోంది. అన్నపూర్ణ ఫిల్మ్‌ కాలేజీలో జరిగిన ఓ ఈవెంట్ లో అమ‌ల గెస్ట్ గా పాల్గొంది. అయితే ఈ ఈవెంట్ లో అమ‌ల త‌న ఎన‌ర్జిటిక్ డ్యాన్స్ తో అంద‌రినీ అల‌రించింది. త‌న భ‌ర్త నాగార్జున హిట్ మూవీ `హ‌లో బ్ర‌ద‌ర్` లో సూప‌ర్ హిట్ సాంగ్ `ప్రియ‌రాగాలే గుండెలోనా పొంగుతునా ఈ వేళ` పాట‌కి అమ‌ల అదిరిపోయే స్టెప్పులు వేసింది.

అమ‌ల వ‌య‌సు 55. కానీ, పాతికేళ్ల అమ్మాయిలా ఫుల్ జ్యోష్ తో అమ‌ల డ్యాన్స్ చేయ‌డం అంద‌రినీ ఆశ్చ‌ర్యానికి గురించింది. అమ‌ల డ్యాన్స్ వీడియో నెట్టింట వైర‌ల్ గా మార‌డంతో.. నెటిజ‌న్లు షాకైపోతారున్నారు. కాగా, అమ‌ల బేసిక్ గానే మంచి నాట్య‌కారిణి. చిన్న‌ప్పుడే నాట్యంలో ప్రావీణ్యం సంపాదించారు. ఆ త‌ర్వాత న‌టిగా ఎంట్రీ ఇచ్చింది. ఎన్నో సూప‌ర్ హిట్ సినిమాలు చేసింది. మంచి పాత్ర‌లు వ‌స్తే ఇప్పుడు కూడా అడ‌పా త‌డ‌పా సినిమాల్లో క‌నిపిస్తోంది.