మెగా ఫ్యామిలీ అండదండలతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన హీరోల్లో అల్లు అర్జున్ ఒకడు. ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్ కు తోడు తనదైన టాలెంట్ తో అల్లు అర్జున్ అనతి కాలంలోనే స్టార్ హోదాను దక్కించుకున్నాడు. నటుడిగా, గొప్ప డ్యాన్సర్ గా మంచి పేరు తెచ్చుకున్నాడు. పుష్ప మూవీతో ఐకాన్ స్టార్ గా మారి పాన్ ఇండియా రేంజ్ లో క్రేజ్ సంపాదించుకున్నాడు.
ఇటీవల ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డును అందుకుని హెడ్ లైన్స్ లో నిలిచాడు. ఇప్పటి వరకు ఏ తెలుగు హీరోకు దక్కని ఘనతను సొంతం చేసుకుని అందరి ప్రశంసలు అందుకున్నారు. ప్రస్తుతం `పుష్ప 2` మూవీతో బిజీగా ఉన్నాడు. అయితే అల్లు అర్జున్ హీరో కాకపోయుంటే ఏమయ్యేవాడో తెలుసా.. అస్సలు గెస్ చేయలేరు.
బన్నీ చెన్నైలో పుట్టారు. 18 ఏళ్లు వచ్చే వరకు అక్కడే పెరిగాడు. ముందు నుంచి చదువుల్లో అల్లు అర్జున్ కాస్త వీక్ గానే ఉండవాడు. కానీ ఆటపాటల్లో చురుగ్గా ఉండేవారు. ముఖ్యంగా చిన్న నాటి నుంచే పియానో చాలా బాగా వాయించేవాడట. చదువు ఎలాగో రాలేదు కాబట్టి పియానో టీచర్ గానైనా బ్రతకొచ్చని అల్లు అర్జున్ అనుకున్నాడట. అయితే ఆ అవసరం ఆయనకు రాలేదు. యుక్తవయసులో అల్లు అర్జున్ డ్యాన్స్ నేర్చుకున్నాడు. నటనలో చిరంజీవి నుంచి కొన్ని మెలకువలు నేర్చుకున్నాడు. హీరోగా ఎంట్రీ ఇచ్చి.. సూపర్ సక్సెస్ అయ్యాడు.