పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పేరు తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. కోట్లాదిమంది అభిమానులను సొంతం చేసుకున్న పవన్ కళ్యాణ్ వృత్తిపరంగా మంచి కీర్తిని సంపాదించాడు. అయితే వ్యక్తిగత విషయానికి వస్తే పవన్ కళ్యాణ్ మూడు పెళ్లిళ్లు చేసుకున్నాడు అన్న సంగతి తెలిసిందే. మొదటి ఇద్దరు భార్యలకు విడాకులు ఇచ్చిన పవన్ కళ్యాణ్ ప్రస్తుతం మూడవ భార్యా అన్నాలెజెనోవాతో కలిసి ఉంటున్నాడు.
ఇక పవన్ కళ్యాణ్ ఈ ముగ్గురి కంటే ముందే మరో అమ్మాయిని ప్రేమించాడంటూ న్యూస్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. కొంతకాలం క్రితం ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న పవన్ కళ్యాణ్ తన పర్సనల్ విషయాలను సినిమా ఇండస్ట్రీలో విషయాలను షేర్ చేసుకున్నాడు. పవన్ మాట్లాడుతు నేను ఇండస్ట్రీకి రాకముందు చెన్నైలో కంప్యూటర్ క్లాస్ కి వెళ్లే వాడినని అక్కడ ఒక అమ్మాయిని చూసి చాలా ఇష్టపడ్డాను.. ఆమె చాలా అందంగా ఉంటుంది అంటూ చెప్పుకొచ్చాడు.
అందరూ ఆ అమ్మాయిని పడేయడానికి చాలా ట్రై చేసే వారిని.. కానీ ఆమె ఎవరితో మాట్లాడకుండా కేవలం నాతోనే మాట్లాడేదని.. అది చూసినా నా ఫ్రెండ్స్ ఆ అమ్మాయికి నువ్వంటే ఇష్టం ఒకసారి ప్రపోజ్ చెయ్ అన్నారని వివరించాడు. దాంతో ఒక మంచి రోజు చూసి పాత కార్ క్లీన్ చేసుకుని సిటీ అంత తిప్పి ఒకచోట ఆగి ఐ లవ్ యూ చెప్పానని దాంతో అమ్మాయికి ఫుల్‌గా కోపం వచ్చేసింది. ఏం మాట్లాడుతున్నావ్.. నువ్వు ఎంత..? నీ వయసెంత..? అని తిట్టి పడేసింది అంటూ చెప్పుకొచ్చాడు. ఈ విషయాన్ని స్వయంగా పవన్ కళ్యాణ్ వివరించడంతో ఈ న్యూస్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది.