వామ్మో దెయ్యం.. పోస్టుమార్టం గదిలో నిచ్చిన ఎక్కి… మీకు ధైర్యం ఉంటే చూడండి ( వీడియో)

పోస్ట్‌మార్టం గదిలో స్వయంగా కదిలిన నిచ్చిన.. అందరినీ భయపెట్టేస్తుంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. వీడియో చూసిన నెటిజనులందరూ అవాకౌతున్నారు. ఈ షాకింగ్ సంఘటన ఉత్తరప్రదేశ్‌లో వెలుగు చూసింది. యూపీలోని ఓ హాస్పటల్ పోస్ట్‌మార్టం గదిలో నిచ్చెన స్వయంగా కదులుతూ వెళ్తున్న వీడియో ప్రజలను ఆశ్చర్యానికి గురి చేసింది. ఈ వీడియోని షేర్ చేసిన కొన్ని గంటల్లోనే 6.8 లక్షల మందికి పైగా వీక్షించారు. ప్రస్తుతం ఈ వీడియోతో సైన్స్ – అదృశ్య శక్తుల మధ్య చర్చలు మొదలయ్యాయి.

ప్రతిదీ శాస్త్రీయంగా నిరూపించబడిన ఆధునిక యుగంలో మనం జీవిస్తున్నాం అయినా నేటికి దెయ్యాలు, ఆత్మలను నమ్మే వాళ్ళు ఉంటున్నారు. వైజ్ఞానిక ప్రపంచం ఎంత అభివృద్ధి చెందిన కొన్నిసార్లు సైన్స్ కూడా ఇలాంటి విషయాలను వివరించడానికి చాలా కష్టపడాల్సిందే. ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారిన ఈ వీడియో సర్వత్ర చర్చనీయాంశం అయింది. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్లోని బరేలీలో ఎస్ఆర్ఎంఎస్ మెడికల్ కాలేజ్ పోస్టుమార్టం హౌస్ లో జరిగింది. ఎదురునిచ్చిన సర్వసాధారణ మనిషి నడిచినట్లుగా నడుస్తున్న వీడియో అందరిని షాప్ కి గురి చేసింది.

వాకింగ్ నిచ్చెన‌ వీడియో క్లిప్ చాలా మందిలో భయాన్ని సృష్టిస్తుంది. అనేక సందేహాలను కలిపిస్తుంది. ఈ నిచ్చెన కదలడానికి వెనుక ఏదో శక్తి ఉంది అంటూ అందరూ చర్చ చేసుకోవడంతో ఈ వీడియో మరింత వైరల్ అయింది. కదులుతున్నప్పుడు శబ్దం చేస్తున్న ఈ నిచ్చెనను చూస్తే ఎవరికైనా భయం కలగడం సహజం. ఈ వీడియోని షేర్ చేసిన కొన్ని గంటలకే బాగా వైరల్ అయింది. నిచ్చిన ఉన్న ప్రాంతం పల్లంగా ఉండడంతో ఆ నిచ్చెన దానంతట అదే ముందుకు కలుగుతుంది తప్ప ఇక్కడ ఎలాంటి మాయాజాలం లేదని కొందరు కామెంట్స్ చేశారు. ఏది ఏమైనా వీడియో మాత్రం అందరిని భయపెడుతుంది ఇప్పటికీ షేర్లు లైకులు పెరుగుతూనే ఉన్నాయి.