రీ రిలీజ్ కి సిద్ధమైన అదుర్స్.. అదే టార్గెట్ అంటున్న తారక్..!

యంగ్ టైగర్ ఎన్టీఆర్, నయనతార, షిల కాంబినేషన్లో డైరెక్టర్ వివి వినాయక దర్శకత్వంలో వచ్చిన చిత్రం అదుర్స్.. ఈ సినిమా 2010 లో విడుదల అయ్యి భారీ విజయాన్ని అందుకుంది. ముఖ్యంగా ఇందులో ఎన్టీఆర్ డబల్ రూల్స్ లో నటించి అందరిని ఆకట్టుకున్నారు. ఇందులో కామెడీ సాంగ్స్ యాక్షన్ అన్నీ కూడా ప్రేక్షకులను బాగా ఆకట్టుకోవడంతోపాటు ముఖ్యంగా చారి..బట్టు కామెడీ సన్నివేశాలు ఇప్పటికీ ప్రేక్షకులను కడుపుబ్బ నవ్విస్తూ ఉంటాయి. ఎన్టీఆర్, బ్రహ్మానందం మధ్య జరిగే సీన్స్ కూడా చాలా హైలెట్గా ఉంటాయని అభిమానులు ఇప్పటికీ చెప్పుకుంటూ ఉంటారు.

ఇప్పుడు తాజాగా మళ్లీ మరొకసారి ఈ సినిమా రీ రిలీజ్ కు సిద్ధమయ్యింది.. ఇప్పటికే స్టార్ హీరోల సినిమాలు సైతం రీ రిలీజ్ అయి మంచి విజయాలను అందుకుంటున్నాయి. తాజాగా అదుర్స్ సినిమాని కూడా రీ రిలీజ్ కు సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించి 4k విజువల్ వర్క్ నడుస్తున్నట్లు తెలుస్తోంది ఈ ఏడాది ఈ సినిమాని రిలీజ్ చేయబోతున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. ఈ విషయం తెలిసి ఎన్టీఆర్ అభిమానులతో పాటు అదుర్స్ సినిమా అభిమానులు కూడా చాలా సంబరపడిపోతున్నారు.

అదుర్స్ లోని కామెడీ సన్నివేశాలను గుర్తు చేసుకుంటూ.. ఇదేం ఫీలింగ్ రా చారి.. గుండె ఆనందంతో పొంగిపోతోంది చంద్రకళతో బట్టు మరొకసారి వస్తున్నాడు అంటూ పలు రకాల కామెంట్స్ షేర్ చేస్తున్నారు మరి ఈ సినిమాకు థియేటర్లలో ఎలాంటి రెస్పాన్స్ లభిస్తుందో చూడాలి మరి.. మరి ఈ సినిమా రీ రిలీజ్ పై చిత్ర బృందం ఎలా స్పందిస్తుందో తెలియాల్సి ఉన్నది.