రకుల్ కారు ఖరీదు తెలిస్తే మతి పోవాల్సిందే…..ఎన్ని కోట్లు అంటే !

ఒకప్పుడు టాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్. కొన్నాళ్లపాటు టెలుగు పరిశ్రమలో ఒక వెలుగు వెలిగి అందరు స్టార్ హీరోల సరసన నటించి మంచి విజయాలను అందుకుంది ఈ ఢిల్లీ భామ. సందీప్ కిషన్ హీరోగా నటించిన వేంకటాద్రి ఎక్సపీరియె చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమిన రకుల్ మొదటి చిత్రంతోనే మంచి విజయాన్ని అందుకుంది. ఆ తరువాత రామ్ చరణ్ తో ధ్రువ, ఎన్టీఆర్ తో నాన్నకు ప్రేమతో, కార్తీ తో ఖాకి వంటి సక్సెస్ఫుల్ సినిమాలలో నటించింది. మొదట్లో హిట్ సినిమాలతో మంచి ఫామ్ లో ఉన్న రకుల్ ఈ మధ్య మాత్రం వరుస ప్లాప్ లతో సతమతమవుతోంది. 2019 నుంచి ఆమె కెరీర్లో ఒక్క హిట్ సినిమా కూడా లేదు. ఆయుష్మాన్ ఖురానా హీరోగా వచ్చిన డాక్టర్ జి చిత్రం మినహా అన్ని చిత్రాలు బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్లుగా మిగిలాయి.

ఐతే తెలుగు తమిళ భాషలలో రకుల్ కు అవకాశాలు బాగా తగ్గిపోయాయి. ఆమె తెలుగులో చివరిగా నటించిన చిత్రం క్రిష్ దర్శకత్వం వహించిన కొండా పొలం. ఈ చిత్రం కూడా ప్రేక్షకులను థియేటర్లకు రప్పించలేకపోయింది. కానీ హిందీలో మాత్రం రకుల్ జోరు తగ్గడం లేదు. వరుస అవకాశాలతో ద్దోసుకుపోతుంది. గత సంవత్సరంరకుల్ హిందీ లో అజయ్ దేవగన్ తో రన్ వే 34, అక్షయ్ కుమార్ తో కట్ పుత్లి, అటాక్, వంటి చిత్రాలతో సందడి చేసింది. అలాగే ఓ టీ టీ లో కూడా పలు చిత్రాలలో నటించింది. ప్రస్తుతం బాలీవుడ్లో ఫుల్ బిజీగా ఉంది రకుల్. తాజాగా ఈ అమ్మడు ఒక లగ్జరీ కార్ ను కొనుగోలు చేసింది. ఆ కార్ ముందు నిలబడి ఫోటోలు కూడా దిగింది. దీనికి సంబంధించి ఫోటోలు , వీడియోలు ఇప్పుడు సోసిల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. రకుల్ కొన్న కారు ముర్సిడిస్ బెంజ్ మేబ్యాక్ జి ఎల్ ఎస్. దీని ధర సుమారు మూడు కోట్లు.

తన కొత్త కారు తో ఫోటోలు దిగి పక్కన ఉన్న వారికి స్వీట్లు పంచి పెట్టి తన ఆనందాన్ని సెలెబ్రేట్ చేసుకుంది రకుల్. ఈ ఫోటోలు చూసిన నెటిజన్లు రకుల్ కు అభినందనలు తెలుపుతున్నారు. రకుల్ ప్రస్తుతం అర్జున్ కపూర్, భూమి పెడ్నేకర్ ల తో కలిసి హస్బెండ్ కి బీవీ చిత్రం లో నటిస్తోంది. ఆ తరువాత అజయ్ దేవగన్ తో కలిసి దే దే ప్యార్ దే 2 నటించబోతోంది సమాచారం.