త‌మ‌న్నా బ్యూటీ సీక్రెట్ లీక్‌.. ఆ రెండు లేక‌పోతే రోజు కూడా గ‌డ‌వ‌ద‌ట‌!

దాదాపు రెండు ద‌శాబ్దాల నుంచి ఇండ‌స్ట్రీలో కొన‌సాగుతున్న అందాల భామ‌, అభిమానులు మిల్కీ బ్యూటీ త‌మ‌న్నా గురించి కొత్త‌గా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. 15 ఏళ్ల‌కే ఇండ‌స్ట్రీలోకి వ‌చ్చిన త‌మ‌న్నా.. త‌క్కువ స‌మ‌యంలోనే స్టార్డ‌మ్ అందుకుంది. సౌత్ తో పాటు నార్త్ లోనూ భారీ క్రేజ్ సంపాదించుకుంది. స‌ప‌రేట్ ఫ్యాన్ బేస్ ను ఏర్ప‌ర్చుకుంది. కెరీర్ ఆరంభం నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ దూసుకుపోతోంది.

అప్ప‌టికీ ఇప్ప‌టికీ త‌మ‌న్నాలో ఎటువంటి మార్పు లేదు. ఈ మ‌ధ్య కాస్త బ‌రువు పెరిగినా.. ఆమె అందం మాత్రం చెక్కుచెద‌ర‌లేదు. అయితే తాజాగా త‌మ‌న్నా త‌న బ్యూటీ మ‌రియు ఫిట్‌నెస్ సీక్రెట్స్ ను లీక్ చేసింది. నిత్యం జిమ్ వర్కవుట్స్ చేయడమే కాకుండా ఆహారపు అలవాట్ల విషయంలో త‌మ‌న్నా చాలా జాగ్ర‌త్త‌లు తీసుకుంటుంద‌ట‌. మార్నింగ్ ఉదయం బ్రేక్ ఫాస్ట్ లో నట్స్, ఖర్జూరపండ్లు, అరటి పండ్లను స‌మానంగా తీసుకుంట‌ద‌ట‌.

మధ్యాహనం లంచ్ లో బ్రౌన్ రైస్, పప్పు, కాయకూరలు తీసుకుంటానని.. సాయంత్రం 5.30కే డిన్నర్ కంప్లీట్ చేస్తాన‌ని త‌మ‌న్నా తెలిపింది. ఆ త‌ర్వాత 12 గంట‌లు ఎటువంటి ఆహారం తీసుకోన‌ని తెలిపింది. ఇక చ‌ర్మ సౌంద‌ర్యం కోసం నిత్యం గ్రీన్ టీ మ‌రియు ఆమ్లా జ్యూస్ తీసుకుంటాన‌ని.. ఇవి రెండు లేక‌పోతే త‌న‌కు రోజు కూడా గ‌డ‌వ‌ద‌ని త‌మ‌న్నా పేర్కొంది. అద‌న్న‌మాట త‌మ‌న్నా అందం వెన‌క ఉన్న ర‌హ‌స్యం.