న‌య‌నతార‌ని ఫాలో అవుతున్న అనుష్క‌..?

నయనతార బాటలో అనుష్కనా అసలు ఏం జరుగుతుంది. నయనతారను అనుష్క ఫాలో అవ్వడం ఏంటి అనుకుంటున్నారా.. లేడీ సూపర్ స్టార్‌గా గుర్తింపు తెచ్చుకున్న నయనతార స్టార్ హీరోయిన్గా ఓ రేంజ్‌కి ఎదిగిన తర్వాత నుంచి సినిమా ప్రమోషన్స్‌లో పాటిస్పేట్ చేయడం మానేసింది. అలాగే ఇప్పుడు అనుష్క కూడా అదే పద్ధతిలో సినిమా ప్రమోషన్స్‌కు రావడానికి ఆసక్తి చూపడం లేదని తెలుస్తుంది. అనుష్క తాజా సినిమా మిస్‌శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమా ప్రమోషన్స్‌లో అనుష్క పాల్గొనడం లేదు నవీన్ పోలీస్ శెట్టి హీరోగా నటించిన ఈ సినిమాలో అనుష్క హీరోయిన్‌గా నటించింది.

కేవలం హీరోయిన్‌గానే కాదు హీరో కంటే కాస్త ఎక్కువగానే వెయిట్ ఉన్న పాత్రలో అనుష్క నటించింది. ఇక అలాంటి పాత్రలు నటించిన అనుష్క సినిమా ప్రమోషన్స్‌కు రావడానికి ఆసక్తి చూపడం లేదట. గడిచిన నాలుగు రోజులుగా నవీన్ ఒక్కడే ఊళ్లను చుట్టేస్తున్నాడు. సినిమా ప్రమోషన్స్ లో భాగంగా సందడి చేస్తున్నాడు. అనుష్క మాత్రం ఇప్పటివరకు ఏ ఈవెంట్లో పాల్గొనలేదు. కొన్నాళ్లుగా అనుష్క వెయిట్ ఇష్యూస్ తో బాధపడుతుంది.

ఈ కారణంగానే ప్రమోషన్స్‌కు రావడం లేదంటూ న్యూస్ వైరల్ అవుతున్నాయి. ఆమె మిస్‌శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమా షూటింగ్ టైమ్‌కి వైట్ తగ్గి నాజూకుగ్గా అవుతుందని అందరూ భావించారు.. కానీ ఆమె వెయిట్ బ్యాలెన్స్ చేయలేకపోతుందట.. ఈ కారణంతోనే గ్రాఫిక్స్‌లో ఫిజిక్ బ్యాలెన్స్ చేసినట్లు తెలుస్తుంది. ప్రమోషన్స్‌కి వస్తే అనుష్క ఒరిజినల్ పర్సనాలిటీ తెలిసిపోతుందనే ఉద్దేశంతో ఈమె ఆడిషన్స్‌కి రావడానికి ఇష్టపడటం లేదంటూ న్యూస్ వైరల్ అవుతున్నాయి.