మ‌హేష్ ఒక్క‌డే కాదు `పుష్ప‌`ను రిజెక్ట్ చేసిన అన్ ల‌క్కీ స్టార్స్ ఎవ‌రెవ‌రో తెలుసా?

పుష్ప: ది రైజ్‌.. ఈ మూవీ సృష్టించిన సంచ‌ల‌నం గురించి ప్ర‌త్యేకంగా వివ‌రించ‌క్క‌ర్లేదు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ తెర‌కెక్కించిన ఈ సినిమాను మైత్రీ మూవీ మేక‌ర్స్ బ్యాన‌ర్ పై పాన్ ఇండియా స్థాయిలో భారీ బ‌డ్జెట్ తో నిర్మించారు. ఇందులో మ‌ల‌యాళ స్టార్ ఫహద్ ఫాసిల్, ర‌ష్మిక మందన్నా, సునీల్‌, అన‌సూయ త‌దిత‌రులు కీల‌క పాత్ర‌ల‌ను పోషించారు. 2021 డిసెంబ‌ర్ లో విడుద‌లైన ఈ చిత్రం బిగ్గెస్ట్ బ్లాక్ బ‌స్ట‌ర్ గా నిలిచింది. బాక్సాఫీస్ వ‌ద్ద కాసుల వ‌ర్షం కురిపించింది.

ఈ సినిమాకు గానూ అల్లు అర్జున్ బెస్ట్ యాక్ట‌ర్ గా జాతీయ అవార్డు కూడా అందుకున్నాడు. ఇంత‌వ‌ర‌కు ఏ తెలుగు హీరోకు ద‌క్క‌ని ఘ‌న‌త‌ను అల్లు అర్జున్ సాధించ‌డంతో.. పుష్ప యూనిట్ లో సంబ‌రాలు అంబ‌రాన్ని అంటాయి. ప్ర‌స్తుతం అల్లు అర్జున్ పుష్ప 2లో బిజీగా ఉన్నాయి. అయితే నిజానికి పుష్ప సినిమాకు అల్లు అర్జున్ ఫ‌స్ట్ ఛాయిస్ కాదు మొద‌ట మ‌హేష్ బాబును హీరో రోల్ కోసం సంప్ర‌దించ‌గా.. ఇంత‌టి వైల్డ్ రోల్ త‌న‌కు సెట్ కాదంటూ నో చెప్పాడు.

అయితే మ‌హేష్ ఒక్కడే కాదు పుష్ప ను మ‌రికొంత‌మంది స్టార్స్ కూడా రిజెక్ట్ చేశారు. ఆ అన్ ల‌క్కీ స్టార్స్ ఎవ‌రో తెలుసుకుందాం ప‌దండి. ఈ సినిమాలో హీరోయిన్ రోల్ కోసం సుకుమార్ ముందుగా స‌మంత‌ను అడిగాడు. కానీ, నాగ‌చైత‌న్య‌తో విభేదాలు, డివోర్స్ టెన్ష‌న్ లో ఉండ‌టం వ‌ల్ల స‌మంత పుష్ప‌ను వ‌దుకుంది. కానీ, అదే స‌మంత ఈ సినిమాలో `ఊ అంటావా..` అంటూ స్పెష‌ల్ సాంగ్ చేసి ఇండియాను ఓ ఊపు ఊపేసింది.

అయితే `ఊ అంటావా..` సాంగ్ కు ముందుగా బాలీవుడ్ హాట్ బ్యూటీస్ నోరా ఫతేహి, దిశా ప‌టానీల‌ను అనుకున్నారు. వీరిద్ద‌రూ నో చెప్ప‌డంతో సుకుమార్ స‌మంత‌ను ఒప్పించాడు. ఇక విల‌న్ గా త‌మిళ స్టార్ విజ‌య్ సేతుప‌తిని అనుకున్నారు. కానీ, ఆయ‌న చేతి నిండా సినిమాలు ఉండ‌టంతో సున్నితంగా తిర‌స్క‌రించాడు. దాంతో మ‌ల‌యాళ న‌టుడు ఫహద్ ఫాసిల్ ను రంగంలోకి దింపారు. ఈయ‌న రోల్ సినిమాలో ఎంత హైలెట్ అయిందో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు.