అఖిల్ కోసం అదిరిపోయే కథ రెడీ చేసిన శ్రీకాంత్ అడ్డాల..

టాలీవుడ్ హీరో అక్కినేని నాగార్జున కొడుకు అక్కినేని అఖిల్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. అఖిల్ ఇండస్ట్రీ లోకి అడుగు పెట్టి కొన్ని ఏళ్ళు అయినప్పటికి సరైన హిట్ మాత్రం అందుకోలేకపోయ్యడు. ఎంత మంది దర్శకులు అఖిల్ కి హిట్ ని ఇవ్వాలని ట్రై చేసిన వర్కౌట్ కావడం లేదు. మరి అఖిల్ కథలు ఎంచుకునే విషయంలో తప్పు చేస్తున్నాడా లేక దర్శకులే సరిగా తియ్యలేకపోతున్నారా అనేది మాత్రం అర్ధం కావడం లేదు. దాంతో ‘అఖిల్ కి సినిమా లు కలిసిరావడం లేదులే కానీ వేరే బిసినెస్ ఏమయినా పెట్టుకో’  అంటూ కొందరు సలహా ఇస్తున్నారు.


తాజాగా అఖిల్ ‘ఏజెంట్’ అనే సినిమా లో నటించాడు. భారీ అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా అనుకోని విధంగా డిసాస్టర్ గా నిలిచింది. ఈ సినిమా కోసం అఖిల్ చాలా కష్టపడ్డాడు కానీ సరైన గుర్తింపు మాత్రం సంపాదించుకోలేకపోయాడు. ఏజెంట్ సినిమా అఖిల్ కెరీర్ ని మలుపు తిప్పుతుంది అని అతని అభిమానులు అనుకున్నారు కానీ దానికి రివర్స్ లో జరిగింది. మరి అఖిల్ ఇప్పటివరకు నటించిన సినిమాలో మంచి హిట్ అయిన సినిమా ఏదయినా ఉంది అంటే అది ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్’ అనే చెప్పాలి. ఇదిలా ఉండగా దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల ఒక మంచి కథను అఖిల్ కోసం రెడీ చేసాడట.

ప్రస్తుతం శ్రీకాంత్ అడ్డాల ‘ పెద కాపు ‘ చిత్రం లో బిజీ గా ఉన్నారు. అది పూర్తయిన వెంటనే అఖిల్ తో సినిమా తీస్తాడని ఇండస్ట్రీ లో టాక్ నడుస్తుంది. అఖిల్ కోసం శ్రీకాంత్ ఒక మంచి మాస్ యాక్షన్ స్టోరీ రెడీ చేస్తున్నాడు. ఆ సినిమా కోసం అఖిల్ ఎప్పటినుండే కసరతులు మొదలుపెట్టినట్లు తెలుస్తుంది. అయితే శ్రీకాంత్ ఇప్పటివరకు యాక్షన్ సినిమా లు తియ్యలేదు. మొదటిసారి యాక్షన్ సినిమా తో అఖిల్ పై ప్రయోగం చేయబోతున్నాడు. ఈ సినిమా ఎలా అయిన విజయం సాధించాలని అఖిల్ ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ఈ సినిమా కి దిల్ రాజు నిర్మాత్తగా వ్యవహారిస్తున్నారు.  ఒకవేల ఈ సినిమా కూడా ప్లాప్ అయితే ఇక అఖిల్ ఇండస్ట్రీ కి దూరం అవ్వక తప్పదు.