గోవా బ్యూటీ ఇలియానా గురించి కొన్ని సంచలన నిజాలు బయటకు వచ్చాయి. ఇలియానా ప్రెగ్నెన్సీ గురించి అందరినీ తెలుసు. తాజాగా ఆమె పండంటి మగ బిడ్డకు కూడా జన్మనిచ్చింది. ఆగస్టు 1న ఇలియానా తల్లిగా ప్రమోట్ అయింది. ఈ శుభవార్తను అందరితోనూ పంచుకున్న ఇలియానా.. తన ముద్దుల కుమారుడి ఫోటోను మరియు పేరుని రివీల్ చేసింది. ఇలియానా తనయుడి పేరు కోవా ఫీనిక్స్ డోలన్.
అయితే ఇంత వరకు ఇలియానా తన బిడ్డకు తండ్రి ఎవరు అన్నది మాత్రం చెప్పలేదు. జులైలో ప్రియుడి ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. అతడి వివారాలు మాత్రం బయటపెట్టలేదు. పైగా అందరూ ఇలియానా పెళ్లి కాకుండానే తల్లి అయిందని అనుకున్నారు. కానీ, ఆల్రెడీ ఆమెకు వివాహం జరిగిందట. అది కూడా ఈ ఏడాదే. ఇలియానా భర్త పేరు మైఖేల్ డోలన్.
గత ఏడాది నుంచి వీరిద్దరూ రిలేషన్ లో ఉన్నారు. ఈ ఏడాది మే 13న ఇలియానా, మైఖేల్ పెళ్లి చేసుకున్నారని వార్తలు వస్తున్నాయి. అతి కొద్ది మంది సన్నిహితుల సమక్షంలో వీరు రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నారట. ఇలియానా ప్రెగ్నెన్సీ అనౌన్స్ చేసిన ఒక నెల ముందే మైఖేల్ తో పెళ్లి పీటలెక్కిందని అంటున్నారు. అయితే ప్రెగ్నెన్సీ విషయాన్ని ఎలాంటి భయం లేకుండా అనౌన్స్ చేసిన ఇలియానా.. పెళ్లి మ్యాటర్ ను ఎందుకు సీక్రెట్ గా ఉంచిందో అర్థం కావడం లేదు. అలాగే ఆమె భర్త పేరు తప్పితే మిగతా వివారాలు కూడా ఏమీ తెలియరాలేదు. ఏదేమైనప్పటికీ గోవా బ్యూటీ మాత్రం భర్త, కుమారుడితో ఇప్పుడు ఫ్యామిలీ లైఫ్ ను ఎంజాయ్ చేస్తుంది.