రానా వైఫ్ మిహీకాకు అరుదైన గౌర‌వం .. కుళ్లుకుంటున్న టాలీవుడ్ హీరోయిన్లు!

విల‌క్ష‌ణ న‌టుడు రానా ద‌గ్గుబాటి 2020లో ఓ ఇంటివాడు అయిన సంగ‌తి తెలిసిందే. మిహీకా బజాజ్ ను ల‌వ్ చేసి.. ఆమెతో ఏడ‌డుగులు వేశారు. హీరోయిన్ల‌కు ఏ మాత్రం తీసిపోని విధంగా రానా వైఫ్ ఉంటుంది. మిహికా బజాజ్ హైదరాబాద్‌కు చెందిన అమ్మాయే అయినా.. ముంబై కేంద్రంగా ఈవెంట్ మేనేజ్‌మెంట్ కంపెనీని నడుపుతున్నారు. `డ్యూ డ్రాప్ డిజైన్ స్టూడియో` అనే కంపెనీకి ఆమె వ్యవస్థాపకురాలు.

ముంబై, హైదరాబాద్‌లో వెడ్డింగ్ ప్లానర్‌గా మిహీకా సుపరిచితులు. ఎంతో మంది సినీ తార‌ల‌తో కూడా ఆమెకు మంచి సంబంధాలు ఉన్నాయి. అయితే తాజాగా మిహీకాకు అరుదైన గౌర‌వం ద‌క్కింది. సాధారణంగా ప్రముఖ మ్యాగజైన్స్ పై హీరోలు లేదా హీరోయిన్స్ కనిపిస్తూ ఉంటారు. ఎప్పుడైనా డైరెక్ట‌ర్స్, క్రీడాకారులు కూడా ఉంటారు. ఇక ఎక్కువగా సినీ స్టార్స్ కనిపించే `హలో` మెగజైన్ పై తాజాగా రానా వైఫ్ మిమీకా ద‌ర్శ‌న‌మిచ్చింది.

స్టార్ హీరోయిన్ల‌కు ఏ మాత్రం త‌క్కువ కాకుండా ఎంతో అందంగా ఆమె క‌నిపించింది. స్కిన్ షోతో అల‌రించింది. రానా వైఫ్ అని తెలియ‌ని కొంద‌రు నెటిజ‌న్లు.. మిహీకా ఏ ఇండ‌స్ట్రీకి చెందిన హీరోయినా అని కూడా వెతికేస్తున్నారు. ఎందుకంటే, అంత‌లా హ‌లో మ‌గ‌జైన్ పై ఆమె ఎట్రాక్ట్ చేస్తోంది. మిహీకాను చూస్తే టాలీవుడ్ హీరోయిన్లు కుళ్లుకోవ‌డం గ్యారెంటీ. కాగా, రానా సినిమాల విష‌యానికి వ‌స్తే.. ప్ర‌స్తుతం ఈయ‌న `హిరణ్య కశ్యప` అనే ప్రాజెక్ట్ ను టేక‌ప్ చేశాడు. ప్రముఖ కామిక్ స్టోరీలు ‘అమర్ చిత్ర కథ’ నుంచి తీసుకున్న స్టోరీతో ఈ మూవీని తెర‌కెక్కించ‌బోతున్నారు. త్వ‌ర‌లోనే ఈ మూవీ ప్రారంభం కానుంది.