మెగాస్టార్ చిరంజీవికి ఆప‌రేష‌న్‌… అస‌లేమైందంటే…!

టాలీవుడ్‌ మెగాస్టార్ చిరంజీవి ఎటువంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి ఎన్నో కష్టాలు పడి స్టార్ హీరోగా ఎదిగాడు. ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి దశాబ్దాలు దాటుతున్నా ఇంకా అదే క్రేజ్‌తో కోట్లది మంది ఫ్యాన్ ఫాలోయింగ్ దూసుకుపోతున్న చిరంజీవి ఇటీవల నటించిన భోళా శంకర్ సినిమా ఫ్లాప్ గా నిలిచినా ఆయన క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. ఇక ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి గురించి ఓ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

గతంలో మెగాస్టార్ చిరంజీవి మోకాలు నొప్పితో ఇబ్బంది కారణంగా సర్జరీ చేయించుకోవడానికి అమెరికా వెళ్లి వచ్చాడంటు వార్తలు వైరల్ అయ్యాయి. ప్రస్తుతం మ‌ళ్ళి అదే కార‌ణంతో మోకాలు ఆపరేషన్ కోసం ఈ వారం ఢిల్లీ లేదా బెంగళూరు వెళ్లే అవకాశం ఉందని వార్తలు వినిపిస్తున్నాయి. దాదాపు నెలన్నర పాటు విశ్రాంతి తీసుకోవాలని తెలుస్తుంది. ఈ నెలాఖరి వరకు చిరు హైదరాబాదులో ఉండడ‌ట‌. ఈ వార్తలు నిజం ఎంత ఉందో తెలియదు గానీ మెగా ఫాన్స్ లో మాత్రం మెగాస్టార్ సర్జరీ పై టెన్షన్ స్టార్ట్ అయింది.