నేషనల్ అవార్డ్స్ లో మెగా హీరోలదే హవా.. ఖుషి లో ఫ్యాన్స్..!!

టాలీవుడ్ లో మెగా ఫ్యామిలీ హీరోలు ఎంతగా కొనసాగుతుందో చెప్పాల్సిన పనిలేదు.. ఇప్పుడు ఏకంగా అవార్డులలో కూడా మెగా కుటుంబం దుమ్ము దులిపేస్తోంది.. మెగా హీరోలు నటించిన సినిమాలకు కూడా జాతీయ సినిమా అవార్డులు అందుకోవడం జరుగుతోంది. RRR సినిమాతో రాజమౌళి, ఎన్టీఆర్, రామ్ చరణ్ పవర్ ఫుల్ కాంబినేషన్లో పాన్ ఇండియా లెవెల్లో ఈ సినిమా రిలీజ్ కావడం జరిగింది.కలెక్షన్ల పరంగా కూడా రికార్డులను బద్దలు కొట్టింది. ఇప్పటివరకు అవార్డులను కూడా భారీగాన్ని సంపాదించింది ఏకంగా ఆరు జాతీయ అవార్డులు RRR సినిమాకే కైవసమయ్యాయి.

బెస్ట్ పాపులర్ మూవీ, బెస్ట్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్, బెస్ట్ కొరియోగ్రాఫర్, బెస్ట్ స్పెషల్ ఎఫెక్ట్ బెస్ట్ మెయిల్ ప్లే బ్యాక్ సింగర్.. ఇవన్నీ కూడా RRR సినిమా ఖాతాలోకి వెళ్లిపోయాయి..రామ్ చరణ్ పాత్ర హైలెట్ కావడంతో.. అవార్డులను మెగా ఖాతాలోని వేస్తున్నారు పలువురు అభిమానులు. అల్లు అర్జున్ నటించిన పుష్ప సినిమాతో ఒక్కసారిగా మంచి పాపులారిటీ సంపాదించారు. ఈ సినిమాతో జాతీయ ఉత్తమ అవార్డును గెలుచుకున్న హీరోగా అల్లు అర్జున్ పేరు సంపాదించారు.

వైష్ణవి తేజ్ నటించిన కొండపొలం సినిమా పాటకు గాను బెస్ట్ లిరికల్ అవార్డు కూడా అందుకున్నారు.. డైరెక్టర్ క్రిష్ ఈ సినిమాని తెరకెక్కించడం జరిగింది. ఈ అవార్డు కూడా మెగా హీరో సినిమాకి ఇవ్వాల్సింది..

2021 ఏడాదికి గాను ఉత్తమ తెలుగు చిత్రంగా జాతీయ సినీ అవార్డుకు ఎంపికయింది ఉప్పెన సినిమా మెగా హీరో వైష్ణవ తేజ్ ఈ సినిమాతో మంచి పాపులారిటీ సంపాదించారు.

అలా ఆర్ఆర్అర్ సినిమాతో పాటు పుష్ప ,ఉప్పెన, కొండపొలం వంటి చిత్రాల హవ మొత్తం మెగా హీరోలదే కావడం గమనార్హం. దీంతో మెగా ఫాన్స్ సైతం తెగ సంబరాలు చేసుకుంటున్నారు.