తెలుగు సినీ పరిశ్రమలో సరికొత్త రికార్డు సృష్టించిన అల్లు అర్జున్..!!

టాలీవుడ్లో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ 69వ జాతీయ చలనచిత్ర అవార్డులో ఉత్తమ నటుడుగా ఎంపికయ్యారు ఈ విషయం తెలిసి ఒక్కసారిగా అల్లు అర్జున్ ,సుకుమార్ బాగాద్వేగానికి గురై కళ్ళల్లో కన్నీళ్ల కూడా రావడం జరిగింది.పుష్ప సినిమాతో పాన్ ఇండియా లెవల్లో పాపులారిటీ సంపాదించుకున్న అల్లు అర్జున్ అందులో అద్భుతమైన నటనతో ప్రతిష్టాత్మకమైన అవార్డును అందుకుంటున్నారు. అల్లు అర్జున్ ఈ విజయంతో ఒకసారి కొత్త చరిత్రను సృష్టించాడు. ఉత్తమ నటనకు జాతీయ అవార్డు తెచ్చిన మొదటి తెలుగు సినిమా నటుడుగా కూడా గుర్తింపు సంపాదించుకున్నారు.

Allu Arjun became emotional after receiving National Award for the first time See in Video Pushpa condition after hearing the news | VIDEO: अल्लू अर्जुन पहली बार नेशनल अवॉर्ड पाकर हुए इमोशनल,

ఇంతకుముందే ఆన్లైన్లో విడుదలైన ఒక వీడియోలో అల్లు అర్జున్ ని ఈ ఆనంద సమయంలో తన కుటుంబ సభ్యుల సమక్షంలో సుకుమార్ తో సహా పుష్ప చిత్ర బృందం చేరి ఆనందాన్ని పంచుకోవడం జరిగింది. అల్లు కుటుంబం స్నేహితుల సమక్షంలో ఈ సంబరాలు జరుపుకుంటున్నట్లు ఈ వీడియోలో కనిపిస్తోంది. దీంతో పాటు భాగోద్వేగంతో అల్లు అర్జున్ సుకుమార్ ను చాలా గాఢంగా కౌగిలించుకోవడం మనం ఈ వీడియోలో చూడవచ్చు. ఈ క్షణాన్ని ఆనందంగా బాగోద్వేగంతో పంచుకున్నారు.

వాస్తవానికి ఇది వీరి యొక్క శ్రమ ప్రతిభకు సరైన గుర్తింపు అని చెప్పవచ్చు.. ఇది కేవలం ఆరంభం మాత్రమే అని భావించాలి ఈ పురస్కారాన్ని దక్కించుకున్న వేళ పుష్ప రాజ్ పాత్రను క్రియేట్ చేసిన సుకుమార్ కి అల్లు అరవింద్ తో సహా ఇతరులు కూడా అభినందనలతో పాటు ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. అలాగే ఈ చిత్రాన్ని నిర్మించిన మైత్రి మూవీ మేకర్స్ వారు కూడా ఉన్నారు. ఉత్తమ నటుడుగా జాతీయ అవార్డు అందుకోవడమే కాకుండా పుష్ప సినిమాకి కూడా ఉత్తమ సంగీత దర్శకుడుగా దేవిశ్రీప్రసాద్ అవార్డును గెలుచుకోవడం అందరికీ ఆనందాన్ని కలిగిస్తోంది. ప్రస్తుతం పుష్ప సీక్వెల్ సినిమాలో బిజీగా ఉన్నారా చిత్ర బృందం.