2 రోజుల్లో రూ. 140 కోట్లు.. `జైల‌ర్‌` విధ్వంసం ఇప్ప‌ట్లో ఆగేలా లేదుగా!

సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ న‌టించిన లేటెస్ట్ యాక్ష‌న్ డ్రామా బాక్సాఫీస్ వ‌ద్ద విధ్వంసం సృష్టిస్తోంది. పాజిటివ్ టాక్ తో వ‌సూళ్ల వ‌ర్షం కురిపిస్తోంది. కేవ‌లం రెండు రోజుల్లోనే ఏకంగా రూ. 140 కోట్ల‌కు పైగా గ్రాస్ క‌లెక్ష‌న్స్ సాధించి దుమ్ము దుమారం లేపింది. తాజాగా జైల‌ర్ 2 డేస్ క‌లెక్ష‌న్ లెక్క‌లు బ‌య‌ట‌కు వ‌చ్చాయి. తెలుగు రాష్ట్రాల్లో రూ. 13 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బ‌రిలోకి దిగిన ఈ సినిమా.. తొలి రోజే ఏకంగా రూ. 7.01 కోట్ల షేర్ ను అందుకోగా, రెండు రోజు రూ. 2.65 కోట్లు రాబ‌ట్టింది.

ఏరియాల వారీగా చూస్తే 2 రోజుల్లో నైజాంలోనే ఈ చిత్రం రూ. 4.39 కోట్ల షేర్ ను అందుకుంది. అలాగే సీడెడ్ లో రూ. 1.30 కోట్లు, ఉత్త‌రాంద్ర‌లో రూ. 1.17 కోట్లు, ఈస్ట్ లో రూ. 62 ల‌క్ష‌లు, వెస్ట్ లో రూ. 43 ల‌క్ష‌లు, గుంటూరులో రూ. 82 ల‌క్షలు, కృష్ణ‌లో రూ. 63 ల‌క్ష‌లు మ‌రియు నెల్లూరులో రూ. 30 ల‌క్ష‌లు రాబ‌ట్టింది. మ‌రో రూ. 3.34 కోట్ల షేర్ క‌లెక్ట్ చేస్తే తెలుగులో జైల‌ర్ క్లీన్ హిట్ అవుతుంది.

ఇక వ‌ర‌ల్డ్ వైడ్ గా రూ. 124 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో జైర‌ల్ వ‌చ్చింది. అయితే తొలి రోజు ప్ర‌పంచవ్యాప్తంగా రూ. 44.75 కోట్ల షేర్ వ‌సూల్ చేసిన జైల‌ర్‌.. రెండో రోజు రూ. 26.10 కోట్లు ద‌క్కించుకుంది. అలాగే రెండు రోజుల్లో రూ. 70.85 కోట్ల షేర్‌, రూ. 144 కోట్ల గ్రాస్ క‌లెక్ష‌న్స్ ను వ‌సూల్ చేసింది. ఇంకా రూ. 53.15 కోట్ల షేర్ ను అందుకుంటే జైల‌ర్ క్లీన్ హిట్ అవుతుంది. కాగా, ప్ర‌పంచ‌వ్యాప్తంగా జైల‌ర్ 2 డేస్ గ్రాస్ క‌లెక్ష‌న్స్ ఈ విధంగా ఉన్నాయి.

త‌మిళనాడు – 39.30 కోట్లు
తెలుగు రాష్ట్రాలు- 17.25 కోట్లు
క‌ర్ణాటక- 17.05 కోట్లు
కేరళ – 9.65 కోట్లు
రెస్టాఫ్ ఇండియా- 3.95 కోట్లు
ఓవర్సీస్ – 56.80 కోట్లు
——————————
వ‌ర‌ల్డ్ వైడ్ కలెక్షన్లు = 144.00 కోట్లు(70.85 కోట్లు~ షేర్)
——————————