నా 13 ఏళ్ల సినీ కెరీర్ లో ఈ దశ ఎంతో నచ్చింది.. సమంత హాట్ కామెంట్స్ వైరల్..!

తెలుగు చిత్ర పరిశ్ర‌మ‌లో స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకున్న వారిలో సమంత ఎప్పుడు ముందు వరుసలో ఉంటుంది.. ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటున్న‌ ఈ ముద్దుగుమ్మ తన వ్యక్తిగత జీవితాన్ని ఎంతో సంతోషంగా ఎంజాయ్ చేస్తుంది. అదేవిధంగా గత కొద్దిరోజులుగా సినిమా షూటింగ్లకు దూరంగా ఉన్న సమంత ఇండస్ట్రీకి దూరంగా ఉన్నప్పటికీ కూడా సోషల్ మీడియాలో మాత్రం ఎంతో యాక్టివ్ గా ఉంటూ తన ప్రతి విషయాన్ని తన అభిమానులతో పంచుకుంటూ వస్తుంది.

అదే విధంగా తన నటించిన సినిమాల ప్రమోషన్లు కూడా సోషల్ మీడియాలో చేస్తుంది. ఇదే సమయంలో గత కొంతకాలంగా సినిమాలకు దూరంగా అంటున్నారు అంటూ ప‌లు వార్త‌లు సోషల్ మీడియాలో వైర‌ల్‌ అవుతున్నాయి. ఇకపోతే చివరగా ఈమె శివ నిర్వాణ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా వస్తున్న ఖుషి సినిమాలో నటించింది. అయితే ఈ సినిమా సెప్టెంబర్ 1న ప్రేక్షకుల ముందుకు రానుంది. విడుదల తేది ద‌గ్గ‌ర‌ పడటంతో చిత్ర యూనిట్ చూరుగా ఈ సినిమా ప్రమోషన్లు చేస్తుంది.

అయితే సమంత మాత్రం వాటికి దూరంగా ఉంటూ అమెరికాలో ఎంజాయ్ చేస్తుంది. అదేవిధంగా మాయోసిటీస్ వ్యాధికి చికిత్స కూడా అక్కడే తీసుకుంటుంది. అయితే ఈ వార్తలు గురించి సమంత ఇప్పటివరకు క్లారిటీ ఇవ్వలేదు.. కానీ ఇక సమంత చిత్ర పరిశ్రమకు ఏడాది పాటు బ్రేక్ ఇచ్చారు అన్న వార్త‌ గురించి తొలిసారిగా మాట్లాడుతూ ఆమె కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.

సమంత మాట్లాడుతూ తన 13 సంవత్సరాలుగా ఇండస్ట్రీలో కొనసాగుతూ ఇప్పుడు కూడా ఇండస్ట్రీకి బ్రేక్ బ్రేక్ ఇవ్వలేదు… ఎప్పుడు కష్టపడుతూ ఎలాంటి విరామం లేకుండా ఇండస్ట్రీలో పని చేశాను.. అయితే మొదటిసారి సినిమాలకు బ్రేక్ తీసుకున్నాను.. ప్రస్తుతం నేను ఒక కొత్త దశను ఎంజాయ్ చేస్తున్నాను. ఈ దశలో ఎక్కువగా ట్రావెలింగ్ చేస్తూ నా జీవితంలో ఎంతో ఖుషి గా ఉన్నాను అంటూ సమంత కామెంట్లు చేసింది. ఇక‌ సమంత చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ గా మారాయి.