ఆ ప‌ని మొద‌లెడితే అయ్యేవ‌ర‌కు నాకు నిద్ర‌ప‌ట్ట‌దు.. హ‌న్సిక కామెంట్స్ వైర‌ల్‌..

హన్సిక ఒకప్పుడు టాలీవుడ్ స్టార్ బ్యూటీగా ఓ వెలుగు వెలిగింది. అయితే గత కొంతకాలంగా టాలీవుడ్ సినిమాలుకు దూరంగా ఉంటుంది ఈ ఆపిల్ బ్యూటీ. దేశముదురు సినిమాతో ఇండ‌స్ట్రీకి అడుగు పెట్టిన హ‌న్సిక ఈ మూవీలో అల్లు అర్జున్ సరసన నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. వరస సినిమాల్లో నటించి తనకంటూ ఓ ప్రత్యేకమైన ఇమేజ్ సంపాదించుకుంది.

 

ప్రస్తుతం తమిళ్ ఇండస్ట్రీలో బిజీగా గడుపుతున్న ఈ ముద్దుగుమ్మ తాజాగా ఓ ఇంటర్వ్యూలో తనకు సంబంధించిన ఆసక్తికర విషయాలను వెల్లడించింది. ఇంటర్వ్యూలో భాగంగా ఆమె మాట్లాడుతూ నాకు రొమాంటిక్ మూవీస్ అంటే చాలా ఇష్టం అని ఇప్పటికే చాలా సినిమాలు చూశాను అంటు చెప్పుకొచ్చింది.

ప్రజెంట్ ఓటీటీలో వెబ్ సిరీస్‌లు చూడడానికి ఇష్టపడుతున్నానని ఏదైనా వెబ్ సిరీస్ నచ్చితే అది పూర్తయ్యేంత వరకు అసలు నాకు నిద్ర కూడా పట్టదని.. ఏదైనా పనిలో ఉండి పూర్తి చేయలేకపోతే ఆ పని మీద కాన్సన్ట్రేషన్ కూడా చేయనని.. అందుకే ఏ సిరీస్ అయినా స్టార్ట్ చేస్తే ఖ‌చ్చితంగా ఫినిష్ చేస్తా అంటూ వివరించింది హన్సిక.