అలనాటి హీరోయిన్లలో మంచి పాపులారిటీ సంపాదించుకున్న వారిలో హీరోయిన్ రోజా కూడా ఒకరు. ఎన్నో విభిన్నమైన సినిమాలలో నటించి మంచి క్రేజ్ సంపాదించుకున్న రోజు ఈ మధ్యకాలంలో సినిమాలలో పెద్దగా కనిపించకపోయినా బుల్లితెర పైన కనిపిస్తూ ఉండేది ఈ మధ్యనే మంత్రి పదవి రావడంతో అన్నిటికీ గుడ్ బై చెప్పి కేవలం తన పదవితోనే ప్రజలకు సేవ చేయాలని చూస్తోంది. అయితే రోజా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన సమయంలో ఒక హీరోయిన్ దయవల్లే ఈమె స్టార్ హీరోయిన్ అయిందనే వార్తలు వినిపిస్తున్నాయి. వాటి గురించి తెలుసుకుందాం.
అసలు విషయంలోకి వెళ్తే రాజేంద్రప్రసాద్ హీరోగా వచ్చిన ప్రేమ తపస్సు అనే సినిమాతో మొదటిసారిగా తెలుగు తెరకు ఎంట్రీ ఇచ్చింది హీరోయిన్ రోజా .. ఈ చిత్రంలో ఈమె యాక్టింగ్ బాగున్నప్పటికీ ఆ తర్వాత అవకాశాలు పెద్దగా రాలేదు.. అలాంటి సమయంలో శోభన్ బాబు హీరోగా నటించిన సర్పయాగం అనే సినిమాలో ఆయన కూతురుగా కూడా నటించింది.. అయితే ఆ సమయంలో మొదట హీరోయిన్ మీనా ను తీసుకున్నారట.. కానీ మీనా అప్పుడే హీరోయిన్గా స్టార్ స్టేటస్ ని అందుకునే సమయంలో ఆమెను ఈ సినిమాలో చనిపోయే పాత్రలో తీసుకుంటే బాగుండదని సినిమా ఎవరు అందగా యాక్సెప్ట్ చేయాలని పరుచూరి బ్రదర్స్ అనుకొని ఎవరైనా కొత్త అమ్మాయిని అయితే ఆ పాత్ర కోసం తీసుకోవాలని నిర్ణయించుకున్నారట.
అలాంటి సమయంలోనే రాజకీయ నాయకుడు శివప్రసాద్ రోజా కి గురువు.. ఆయనకి ఈ విషయం తెలియడంతో పరుచూరి బ్రదర్స్ కి తమ ప్రేమ తపస్సు సినిమాని రోజా కు రిఫర్ చేయడం జరిగిందట.. సినిమాలో రోజా యాక్టింగ్ చూసిన పరుచూరి బ్రదర్స్ మన సినిమాలో ఈమె క్యారెక్టర్ కరెక్టుగా సెట్ అవుతుందని భావించి అలా శోభన్ బాబు సర్పయాగం సినిమాలో శోభన్ బాబు కూతురుగా నటించింది. అయితే మీనా ఈ సినిమాలో నటించకపోవడం వల్ల రోజాకి ఆ అవకాశం వచ్చి స్టార్ స్టేటస్ ని అందుకుంది.