పూజా హెగ్డే కి కూడా క్యాస్టింగ్ కౌచ్ ఎదురయ్యిందా..!!

టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా ఒక వెలుగు వెలుగుతున్న పూజా హెగ్డే హవా ఈ మధ్యకాలంలో చాలా తగ్గిపోయిందని చెప్పవచ్చు.. స్టార్ హీరోల చిత్రాలలో అవకాశాలు వచ్చిన పెద్దగా నటించకుండా రిజెక్ట్ చేస్తూ వస్తోంది. ఈమె నటించిన చిత్రాలన్నీ కూడా ఘోరమైన డిజాస్టర్ కావడంతో ఇలాంటి పనిచేస్తోందని వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ అనేది ఎన్నో ఏళ్లుగా వినిపిస్తూనే ఉంది. తాజాగా ఈ విషయం పైన పూజా హెగ్డే స్పందించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. వాటి గురించి తెలుసుకుందాం.

Pooja Hegde shares intense workout video; is caption about Guntur Kaaram?

ఎంతోమంది స్టార్ హీరోల సరసన నటించిన పూజ హెగ్డే ప్రస్తుతం బాలీవుడ్ లో కూడా పలు చిత్రాలను నటిస్తూ బిజీగా మారిపోయింది.అయితే ఇప్పటికి చాలామంది ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ మీద స్పందించారు.పూజ హెగ్డే ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తాను ఇండస్ట్రీలోకి వచ్చి చాలా కాలం అవుతోంది .కానీ ఇప్పటివరకు తనకు అలాంటిది ఎదురు కాలేదని చాలామంది స్నేహితులు ఇలాంటివి పేస్ చేశామని తెలియజేశారట. అయితే ఈ విషయం తెలిసి తనకు చాలా బాధగా అనిపించిందని తెలియజేసింది.

కానీ ఇలాంటి దుర్మార్గులను అసలు క్షమించకూడదు ఇండస్ట్రీకి ఎన్నో ఆశలతో ఎంతోమంది అమ్మాయిలు వస్తూ ఉంటారు.. వారి ఆశలను ఎరగా వేసుకొని ఇలాంటివి చేస్తూ ఉంటారు ఇలాంటి వారిని ఇబ్బంది పెడితే అది ఇండస్ట్రీకే మంచిది కాదు అంటూ తెలియజేసింది పూజా హెగ్డే..అయితే ప్రస్తుతం పూజ హెగ్డే ఈ విషయం పైన స్పందించడంతో పలువురు నెటిజెన్లు పూజా హెగ్డే కూడా ఎప్పుడో ఇలాంటి చేదు అనుభవం ఎదురయిందా అంటూ కామెంట్స్ చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం ఈ విషయం మాత్రం సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతోంది.