సుమని పెళ్లి చేసుకునే ముందు రాజీవ్ ఎలాంటి కండిషన్ పెట్టాడో తెలుసా..

ప్రముఖ బుల్లి తెర యాంకర్ సుమా కనకాల గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. టీవీ షో లో, ప్రీ రిలీజ్ ఈవెంట్ లో , సెలబ్రిటి టాక్ షో లో ఇలా ప్రతీ ఒక్క చోట సుమా కనపడుతూనే ఉంటుంది. తన మాటలతో, పంచులతో అందరిని కడుపుబ్బా నవీస్తూ,అల్లరిస్తూ ఉంటుంది . సుమా కాకుండా మరెవరైనా హోస్ట్ చేస్తే ఆ షో అనుకుంనంత రేంజ్ కి వెళ్లడం కష్టమే అని చెప్పాలి. అందుకే సుమా డేట్స్ కి తగ్గట్లుగా స్టార్ హీరో లు కూడా ప్రీ రిలీజ్ ఈవెంట్స్ ని ప్లాన్ చేసుకుంటుంటారు. దీని బట్టి చూస్తే సుమాకి ఉన్న క్రేజ్ ఏంటో అర్ధం అవుతుంది.

సుమా గురించి ఎప్పుడు సోషల్ మీడియా లో ఏదో ఒక వార్త వైరల్ అవుతూనే ఉంటుంది. ఈ మలయాళ కుట్టి తెలుగు స్పష్టంగా మాట్లాడుతూ అచ్చతెలుగు ఆడపిల్లల కనపడుతుంది. ఇక సుమా భర్త రాజీవ్ కనకాల కూడా మంచి నటుడు అనే విషయం అందరికి తెలిసిందే. అయితే నిన్న సుమా పుట్టినరోజు సందర్బంగా ఆమె తన భర్త రాజీవ్తో ప్రేమ, పెళ్లి కి సంబందించిన కొన్ని ఆసక్తి కర విషయాలను అభిమానులతో పంచుకుంది. రాజీవ్, సుమా ల ప్రేమ ప్రయాణం 1994 లో మొదలైంది. ఆ ప్రేమను 1999 లో పెళ్లి పీటలెక్కించారు ఇద్దరు.

అయితే మొదట రాజీవ్, సుమా కి ప్రపోస్ చేసినప్పుడు ఆమె రిజెక్ట్ చేసిందట. ఆ తరువాత కొంతకాలనికి సుమా కూడా రాజీవ్ తో ప్రేమలో పడిపోయింది. సుమా గ్రీన్ సిగ్నల్ ఇవ్వగానే రాజీవ్ ఒక కండిషన్ పెట్టాడట. అదేంటంటే ‘ పెళ్లి తరువాత సినిమాలో నటించొద్దు ‘ అని చెప్పాడట రాజీవ్. దాంతో సుమా ఆ కండిషన్ ని రిజెక్ట్ చేసి రాజీవ్ తో సంవత్సరంనర వరకూ మాట్లాడలేదట. ఆ టైమ్ లోనే సుమా రెండుమూడు సినిమా లో నటించింది. ఆ తరువాత ఎందుకో సుమాకి సినిమాలు నచ్చకపోవడం తో సినిమాలు మానేసి రాజీవ్ తో మాట్లాడి తమ ప్రేమ విషయాన్ని రాజీవ్ తండ్రి దేవదాస్ కి చెప్పి 1999 లో వివాహం చేసుకున్నారు. రాజీవ్ ఏ ఆమెకి మొదటి విమర్శకుడు, ఏదైనా షో బాగుంటే మెచ్చుకుంటాడు అని సుమా చెప్పుకొచ్చింది.