నా జీవితంలో చాలా బ్రేక‌ప్‌లు… ర‌ష్మీ బాధలు చూశారా…!

జబర్దస్త్ కామెడీ షో ద్వారా పాపులారి దక్కించుకుంది రష్మీ. ఓ ప‌క్క‌ శ్రీదేవి డ్రామా కంపెనీ సహ ప‌లు షోల లో బిజీగా గడుపుతునే మ‌రో ప‌క్క సినిన‌మాలో కేడా న‌టిస్తుంది. ఇక బుల్లితెర స్టార్ జంట అంటే మొదటిగా గుర్తుకొచ్చేది సుధీర్, రష్మీ వీరిద్దరూ స్టేజి పైన కనిపిస్తే ప్రేక్షకులకు పండగగా ఉంటుంది. ఇటీవల ఈ కపుల్ పెళ్లి చేసుకోబోతున్నారని వార్తలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి. కానీ అవన్నీ వాస్తవాలు కాదంటూ రష్మీ క్లారిటీ ఇచ్చింది.

తాజాగా రిలీజ్ అయిన భోళా శంకర్ మూవీలో చిరంజీవి స‌ర‌స‌న‌ రొమాంటిక్ స్టెప్పులు వేసిన రష్మీ ప్రస్తుతం కన్నడలో సూపర్ హిట్ గా నిలిచి.. తెలుగులో రీమేక్ చేసిన బాయ్స్ హాస్టల్ మూవీలో నటిస్తోంది. కాగా ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా రష్మి మాట్లాడుతూ అందరి జీవితంలో రిలేషన్షిప్స్ హార్ట్ బ్రేక్స్ ఉంటాయి. 16 టు 60 ఏజ్ గ్రూప్ వారంతా ఇలాంటి సిచువేషన్ ఏదో సమయంలో ఎదుర్కొంటూనే ఉంటారు .

ఇక నా లైఫ్‌లో బ్రేకప్ ల గురించి చెప్పాలంటే.. కౌంట్ చేసి చెప్పడం చాలా కష్టం.. అంటూ ఎమోషనల్ అయింది. ఆ ఈవెంట్ లో భాగంగా రష్మీ అంత ఎమోషనల్‌గా మాట్లాడడంతో యాంకర్ లైఫ్ లో ఎన్నీ లవ్ స్టోరీస్ ఉన్నాయో అంటూ జనాలు కామెంట్స్ పెడుతున్నారు. ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.