మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కొద్ది రోజుల క్రితమే తండ్రిగా ప్రమోట్ అయిన సంగతి తెలిసిందే. ఆయన సతీమణి పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఆమెకు క్లిన్ కారా కొణిదెల అంటూ నామకరణం కూడా చేశాడు. అయితే రామ్ చరణ్ ఫస్ట్ టైమ్ సోషల్ మీడియా ద్వారా తన కూతురు ఫోటోను పంచుకున్నాడు. మెగాస్టార్ చిరంజీవి, క్లిన్ కారా కలిసి ఉన్న ఫోటోను ఇన్‌స్టాగ్రామ్ ద్వారా పంచుకున్న రామ్ చరణ్.. తన తండ్రికి స్పెషల్ బర్త్‌డే విషెస్ తెలిపాడు.
ఈ రోజు చిరంజీవి బర్త్‌డే. దీంతో వరల్డ్ వైడ్ గా ఉన్న మెగా ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు. అలాగే సోషల్ మీడియాలో నేటి ఉదయం నుంచి చిరంజీవి పేరును మోతమోగిస్తున్నారు. సినీ, రాజకీయ ప్రములు, అభిమానులు, నెటిజన్లు చిరంజీవికి బర్త్‌డే విషెస్ తెలుపుతున్నారు. తాజాగా తన తండ్రికి రామ్ చరణ్ కూడా ఇన్‌స్టాగ్రామ్ ద్వారా విషెస్ ను తెలిపారు.
`ప్రియమైన చిరుత(చిరంజీవి తాత)కు పుట్టినరోజు శుభాకాంక్షలు. మా తరపు నుంచి, కొణిదెల ఫ్యామిలీలో కొత్తగా చేరిన చిన్న వ్యక్తి నుంచి మీకు ఎంతో ప్రేమను అందిస్తున్నాం` అంటూ రామ్ చరణ్ పోస్ట్ పెట్టాడు. ఈ సందర్భంగా చిరు.. తన మనవరాలు క్లిన్ కారాను ఎత్తుకున్న ఫోటోను కూడా చరణ్ షేర్ చేశాడు. అయితే ఈ ఫోటోలో క్లిన్ కారా మోహం కనిపించకుండా ఫేస్‌పై ఎమోజీ పెట్టాడు. అయినాసరే రామ్ చరణ్ పోస్ట్ తెగ వైరల్ అవుతోంది. పాప ఫేస్ చూపించమంటూ మెగా ఫ్యాన్స్ తెగ రిక్వెస్ట్ చేసేస్తున్నారు.
View this post on Instagram