బాలీవుడ్ సెన్సేషన్ జాన్వీ కపూర్ తో ప్రభాస్ అదిరిపోయే స్టెప్పులు.. ఏ సినిమా అంటే ఎవరు ఊహించరు..!?

పాన్ ఇండియా హీరో ప్రభాస్ ప్రస్తుతం హిట్- ప్లాప్‌లతో సంబంధం లేకుండా వరుస సినిమాలతో ప్రేక్షకుల‌ ముందుకు వస్తున్నాడు. ఇప్పటికే ఈ ఏడాది ఆదిపురుష్‌ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ప్రభాస్ మరి కొద్ది రోజుల్లోనే సలార్ సినిమాతో కూడా ప్రేక్షకులు ముందుకు రాబోతున్నాడు. ఇక ఇదే సమయంలో ప్రపంచ సినిమా మొత్తం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమాలలో ప్రభాస్ నటిస్తున్న కల్కి 2898AD కూడా ఒకటి.. టాలీవుడ్ సీనియర్ నిర్మాత అశ్వినీ దత్ నిర్మిస్తున్న ఈ సినిమాను మహానటి ద‌ర్శ‌కుడు నాగ్‌ అశ్విన్ ఎంతో గ్రాండ్గా తెరకేక్కిస్తున్నాడు.

ఇప్పటికే చాలా వరకు షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా వచ్చే ఏడాది సమ్మర్ లో ప్రేక్షకులు ముందుకు రానుంది. రీసెంట్ గానే ఈ సినిమా నుంచి వచ్చిన టీజర్ కూడా ఈ సినిమాపై అంచనాలను మరో లెవల్ కు తీసుకువెళ్లింది. అదేవిధంగా ఈ సినిమాల్లో ప్రభాస్ తో పాటు లోక నాయకుడు కమలహాసన్ కూడా విలన్ పాత్రలో నటించబోతున్నాడు. అంతేకాకుండా బిగ్‌బి అమితాబచ్చన్, దీపికా పదుకొనే వంటి ఎందరో అగ్ర నటులు ఈ సినిమాలో కనిపించనున్నారు.

టైం మిషన్, సైన్స్ ఫిక్షన్ కాన్సెప్ట్ లో వస్తున్న ఈ సినిమాను ప్రాజెక్టుకే అనే వర్కింగ్ టైటిల్తో ఇప్పటివరకు షూటింగ్ చేసి కల్కి 2898AD అని టైటిల్ ని ఫిక్స్ చేశారు. అయితే ఈ సినిమాలో గ్రాండ్ విజువల్స్ తో పాటు ఓ స్పెషల్ సాంగ్ కూడా ప్లాన్ చేశారట దర్శకుడు నాగ్ అశ్విన్‌. అదేవిధంగా ఈ పాటలో బాలీవుడ్ సెన్సేషన్ జాన్వీ కపూర్ ప్రభాస్ తో స్టెప్పలు వేస్తారట.. అదేవిధంగా ఈ సినిమాకి ఇది సర్ప్రైజ్ ఎలిమెంట్ గా ఈ సాంగ్ ను డిజైన్ చేశారని టాక్ కూడా వినిపిస్తుంది. ఇక మరి ప్రభాస్ తో జాన్వీ కపూర్ ఏ విధంగా చిందులు వేస్తుందో చూడాలంటే వచ్చే సమ్మర్ వరకు వెయిట్ చేయాల్సిందే.